Telugu Global
Cinema & Entertainment

మరో హీరో పెళ్లికి రెడీ

టాలీవుడ్ నుంచి మరో హీరో పెళ్లికి రెడీ అవుతున్నాడు. హీరో సుమంత్ అశ్విన్ ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈనెల 13న హైదరాబాద్ శివార్లలోని ఓ రిసార్ట్ లో సుమంత్ పెళ్లి జరుగుతుంది. ఈ విషయాన్ని సుమంత్ అశ్విన్ తండ్రి, నిర్మాత ఎమ్మెస్ రాజు స్వయంగా ప్రకటించారు. సుమంత్ అశ్విన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు దీపిక. ఈమె అమెరికాలో డాక్టర్ చదివినట్టు తెలుస్తోంది. స్వయంగా ఎమ్మెస్ రాజు దగ్గరుండి, తన కొడుకు కోసం సెట్ చేసిన […]

మరో హీరో పెళ్లికి రెడీ
X

టాలీవుడ్ నుంచి మరో హీరో పెళ్లికి రెడీ అవుతున్నాడు. హీరో సుమంత్ అశ్విన్ ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈనెల 13న హైదరాబాద్ శివార్లలోని ఓ రిసార్ట్ లో సుమంత్ పెళ్లి జరుగుతుంది. ఈ విషయాన్ని సుమంత్ అశ్విన్ తండ్రి, నిర్మాత ఎమ్మెస్ రాజు స్వయంగా ప్రకటించారు.

సుమంత్ అశ్విన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు దీపిక. ఈమె అమెరికాలో డాక్టర్ చదివినట్టు తెలుస్తోంది. స్వయంగా ఎమ్మెస్ రాజు దగ్గరుండి, తన కొడుకు కోసం సెట్ చేసిన సంబంధం ఇది.

ఈమధ్య కాలంలో హీరోలంతా వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రానా, నిఖిల్, నితిన్ లాంటి హీరోలంతా రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సుమంత్ అశ్విన్ కూడా ఈ లిస్ట్ లోకి చేరుతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ఇదే మా కథ అనే సినిమా చేస్తున్నాడు.

First Published:  3 Feb 2021 8:06 AM GMT
Next Story