Telugu Global
National

మీడియాకు మొహం చాటేస్తున్న బీజేపీ నేతలు !

ఫిబ్రవరి1న బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఢిల్లీలో బడ్జెట్‌ భళా అని బీజేపీ నేతలు పొగడితే.. గల్లీలో మాత్రం సందడి లేదు. బడ్జెట్ రోజు నుంచి మీడియా డిబేట్లకు కమలం నేతలు మొహం చాటేశారు. ప్రతి అంశంలోనూ దూకుడుగా దూసుకు వచ్చే ఏపీ నేతలు ఫిబ్రవరి 1 నుంచి కనిపించడం లేదు. డిబేట్లకు రావడం లేదు. బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకే కేటాయింపులు లేవు. కామన్‌ మ్యాన్‌ను అట్రాక్ట్‌ చేసే ప్రతిపాదనలు లేవు. బడ్జెట్‌ గురించి ఏం చెప్పాలో తెలియక.. బీజేపీ […]

మీడియాకు మొహం చాటేస్తున్న బీజేపీ నేతలు !
X

ఫిబ్రవరి1న బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఢిల్లీలో బడ్జెట్‌ భళా అని బీజేపీ నేతలు పొగడితే.. గల్లీలో మాత్రం సందడి లేదు. బడ్జెట్ రోజు నుంచి మీడియా డిబేట్లకు కమలం నేతలు మొహం చాటేశారు. ప్రతి అంశంలోనూ దూకుడుగా దూసుకు వచ్చే ఏపీ నేతలు ఫిబ్రవరి 1 నుంచి కనిపించడం లేదు. డిబేట్లకు రావడం లేదు.

బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకే కేటాయింపులు లేవు. కామన్‌ మ్యాన్‌ను అట్రాక్ట్‌ చేసే ప్రతిపాదనలు లేవు. బడ్జెట్‌ గురించి ఏం చెప్పాలో తెలియక.. బీజేపీ నేతలు ఫోన్లు స్విచాఫ్ చేశారు. రెగ్యులర్‌గా డిబేట్లలో దంచికొట్టే ఎంపీ జీవిఎల్‌ అయితే తనకు తెలిసిన కొందరు ఢిల్లీ జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు మాత్రం ఇచ్చారు. చానళ్ల డిబేట్లకు రాలేనని ఆయన రోజే చెప్పేశారట. ఇటు ఒంటికాలిపై లేచే విష్ణువర్ధన్‌రెడ్డి కూడా నాలుగు రోజులుగా మీడియాలో కనిపించడం లేదు. అసలు ఆయన మాటే వినిపించడం లేదు. బడ్జెట్‌పై ఏం చెప్పాలి! ప్రత్యర్థుల విమర్శలకు సమాధానం చెప్పే పరిస్థితి లేదని ఆయన వాపోయారట. రఘురాం అనే బీజేపీ అధికార ప్రతినిధి కూడా చాలా రోజులుగా కనిపించడం లేదు. తనకు పార్టీలో ప్రాధాన్యత లేదని ఆయన పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారట. సత్యమూర్తి అనే మరో నేత ఏదో అశ్రమంలో చికిత్స పొందుతున్నారట. మొత్తానికి పంచాయతీ ఎన్నికల టైమ్‌లోనే ఏపీ బీజేపీ నేతలు మొత్తం సైలెంట్‌ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మరోవైపు ఇటు తెలంగాణ నేతలది కూడా ఇదే సిట్యుయేషన్‌. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నుంచి కింది కేడర్‌ వరకు పెద్దగా స్పందన లేదు. ఏవో ఉత్తుత్తి ప్రకటనలతో కమలం నేతలు సరిపెట్టారు. బండి సంజయ్‌ కొంచెం దూకుడు తగ్గించారు. ఇటు టీఆర్‌ఎస్‌ నేతలు కూడా బడ్జెట్‌పై స్పందించలేదు. ఎంపీలు కూడా మాట కూడా మాట్లాడలేదు.

First Published:  3 Feb 2021 10:48 AM GMT
Next Story