Telugu Global
National

ఇది ప్రజాస్వామ్యమేనా..! రైతులతో యుద్ధం చేస్తున్నారా?

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రైతు ఉద్యమానికి ప్రజాస్వామికవాదులు, వివిధ పార్టీల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. మరోవైపు బీజేపీ మాత్రం రైతు ఉద్యమంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నది. ఈ ఉద్యమం ఖలిస్థాన్​ ప్రేరేపిత ఉద్యమం అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. జనవరి 26న జరిగిన రైతుల ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎర్రకోటపై కొందరు ఆందోళనకారులు వివాదాస్పద జెండాలు కూడా ఎగరవేశారు. అయితే ప్రస్తుతం […]

ఇది ప్రజాస్వామ్యమేనా..! రైతులతో యుద్ధం చేస్తున్నారా?
X

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రైతు ఉద్యమానికి ప్రజాస్వామికవాదులు, వివిధ పార్టీల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. మరోవైపు బీజేపీ మాత్రం రైతు ఉద్యమంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నది. ఈ ఉద్యమం ఖలిస్థాన్​ ప్రేరేపిత ఉద్యమం అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. జనవరి 26న జరిగిన రైతుల ట్రాక్టర్​ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎర్రకోటపై కొందరు ఆందోళనకారులు వివాదాస్పద జెండాలు కూడా ఎగరవేశారు. అయితే ప్రస్తుతం రైతులకు వివిధ రాష్ట్రాలనుంచి రైతుసంఘాలు మద్దతు తెలుపుతున్నారు..

ఇప్పటికే ఉత్తర్​ప్రదేశ్​ రైతులు కూడా ఉద్యమంలో పాల్గొంటున్నారు. అయితే తాజాగా రైతు ఉద్యమంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శ ప్రియాంక వాద్రా మద్దతు తెలిపారు. ఇంతకాలంగా రైతులు ఆందోళన చేస్తుంటే నరేంద్రమోదీ ఏం చేస్తున్నారని ఆమె విమర్శించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నదాతలపై యుద్ధం ప్రకటించారా? అని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ప్రియాంక ట్వీట్​ చేశారు. ఢిల్లీలో సరిహద్దుల్లో భారీగా మోహరించిన భద్రతా బలగాల వీడియోను కూడా ఆమె జత చేశారు.

రైతులు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే .. ప్రభుత్వం మాత్రం భయాందోళనకు గురిచేస్తుందంటూ ఆమె విమర్శించారు. రైతులు నిరసనలు తెలుపుతున్న ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం మంగళవారం విమర్శలు గుప్పిచారు. ‘గోడలు కాదు, వంతెనలు కట్టండి’ అంటూ ఆయన మండిపడ్డారు.

First Published:  2 Feb 2021 5:24 AM GMT
Next Story