Telugu Global
National

శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా!

అన్నా డీఎంకే బహిష్కతనేత, జయ నెచ్చెలి శశికళ బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్న శశికళ అనుచరులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. శశికళ మేనల్లుడు దినకరన్ వందల కొద్ది వాహనాలతో ఆస్పత్రి వద్దకు చేరుకొని శశికళకు స్వాగతం పలికారు. అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయిన శశికళ నాలుగేళ్లపాటు బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైల్లో శిక్ష అనుభవించారు. ఈనెల 27వ తేదీ ఆమె జైలు నుంచి విడుదల కావాల్సి […]

శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా!
X

అన్నా డీఎంకే బహిష్కతనేత, జయ నెచ్చెలి శశికళ బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి నుంచి ఆదివారం డిశ్చార్జి అయ్యారు. ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్న శశికళ అనుచరులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. శశికళ మేనల్లుడు దినకరన్ వందల కొద్ది వాహనాలతో ఆస్పత్రి వద్దకు చేరుకొని శశికళకు స్వాగతం పలికారు.

అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయిన శశికళ నాలుగేళ్లపాటు బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైల్లో శిక్ష అనుభవించారు. ఈనెల 27వ తేదీ ఆమె జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా 20వ తేదీన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముందుగా జైల్లో ఆ తర్వాత బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో శశి కళకు చికిత్స అందజేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఆమెకు పాజిటివ్ తేలింది.

27వ తేదీ శశికళ జైలు శిక్ష పూర్తవడంతో జైలు అధికారులు ఆమె విడుదలకు సంబంధించిన తంతును ఆస్పత్రిలోనే పూర్తి చేశారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో శశికళకు నెగటివ్ ఫలితం రావడంతో ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

జయ మరణానంతరం సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టాలని అనుకుంటున్న సమయంలో అనుకోని పరిస్థితుల్లో శశికళ జైలుపాలయ్యారు. అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన పళని స్వామి శశికళ ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత శశికళ మేనల్లుడు దినకరన్ అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని స్థాపించారు. అయితే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన శశికళ కారుపై అన్నాడీఎంకే పార్టీ జెండా ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆమె వాహనం పైన ఆ జెండా చూసి శశికళ కు స్వాగతం పలకడానికి వచ్చిన వారు ఆశ్చర్యపోయారు.

30 ఏళ్లుగా జయలలిత వెంట ఉన్న శశికళ జయ తర్వాత నెంబర్ టూ స్థానంలో అన్నాడీఎంకే పార్టీలో చక్రం తిప్పారు. అన్నా డీఎంకేలో ఇప్పుడున్న సీనియర్ నేతలు అందరూ శశికళకు సలాం కొట్టినవారే. అయితే అన్నా డీఎంకే పార్టీని తిరిగి కైవసం చేసుకునేందుకు శశికళ వ్యూహం పన్నుతున్నట్లు సమాచారం. చెన్నై కి చేరుకోగానే ఇందుకు కార్యాచరణ అమల్లోకి తేనున్నట్లు సమాచారం. అందుకే ఆమె వాహనంపై అన్నా డీఎంకే జెండా ఇంకా కొనసాగుతోందని అంటున్నారు.

First Published:  31 Jan 2021 10:17 AM GMT
Next Story