Telugu Global
Cinema & Entertainment

వకీల్ సాబ్ డేట్ వచ్చేసింది

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ బ్యానర్ పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు ద‌ర్శ‌కుడు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసి వ‌కీల్‌సాబ్‌పై అంచ‌నాల‌ను అమాంతంగా పెంచింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్పుడీ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. ఈ సమ్మ‌ర్‌లో బాక్సాఫీస్ హీట్‌ను […]

వకీల్ సాబ్ డేట్ వచ్చేసింది
X

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్
స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌ బ్యానర్ పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు
ద‌ర్శ‌కుడు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసి
వ‌కీల్‌సాబ్‌పై అంచ‌నాల‌ను అమాంతంగా పెంచింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా
జ‌రుగుతున్నాయి. ఇప్పుడీ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు.

ఈ సమ్మ‌ర్‌లో బాక్సాఫీస్ హీట్‌ను పెంచ‌డానికి 'వ‌కీల్‌సాబ్‌'ను ఏప్రిల్ 9న ప్ర‌పంచవ్యాప్తంగా భారీ ఎత్తున
విడుద‌ల చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమాను ఎలా చూడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారో
అలాంటి మాస్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసి ద‌ర్శ‌కుడు శ్రీరామ్ వేణు తెర‌కెక్కించాడు. ప్ర‌తి ఫ్రేములోనూ
శ్రీరామ్ వేణు.. ప‌వ‌న్‌ను యూత్‌, మాస్ స‌హా అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా చ‌క్క‌గా ఎలివేట్
చేశాడు.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య
నాగ‌ళ్ల కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  30 Jan 2021 8:06 AM GMT
Next Story