Telugu Global
Health & Life Style

స్పేస్ టూర్ రెడీ!

ఇప్పుడు టెక్నాలజీ ఎంతగా అప్‌డేట్ అయిదంటే.. ప్రపంచం నలుమూలలకు ట్రావెల్ చేయడమే కాదు. అంతరిక్షంలోకి కూడా ట్రావెల్ చేసే టూర్స్ వచ్చేశాయి. మీ దగ్గర టికెట్ డబ్బులుంటే చాలు.. రోదసిలోకి నేరుగా తీసుకెళ్లే స్పేస్ టూర్స్ వచ్చే జనవరి కల్లా రెడీ అవుతున్నాయి. అక్సియోమ్ అనే సంస్థ స్పేస్ టూర్ కోసం ఎప్పటినుంచో ప్లాన్ చేస్తుంది. అక్సియోమ్ నిర్వహిస్తున్న ‘ఎఎక్స్-1 స్పేస్ మిషన్’ అంతరిక్షంలో ఉండే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు పర్యాటకులను సిద్ధం చేస్తోంది. అక్సియోమ్ మిషన్ […]

స్పేస్ టూర్ రెడీ!
X

ఇప్పుడు టెక్నాలజీ ఎంతగా అప్‌డేట్ అయిదంటే.. ప్రపంచం నలుమూలలకు ట్రావెల్ చేయడమే కాదు. అంతరిక్షంలోకి కూడా ట్రావెల్ చేసే టూర్స్ వచ్చేశాయి. మీ దగ్గర టికెట్ డబ్బులుంటే చాలు.. రోదసిలోకి నేరుగా తీసుకెళ్లే స్పేస్ టూర్స్ వచ్చే జనవరి కల్లా రెడీ అవుతున్నాయి.

అక్సియోమ్ అనే సంస్థ స్పేస్ టూర్ కోసం ఎప్పటినుంచో ప్లాన్ చేస్తుంది. అక్సియోమ్ నిర్వహిస్తున్న ‘ఎఎక్స్-1 స్పేస్ మిషన్’ అంతరిక్షంలో ఉండే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు పర్యాటకులను సిద్ధం చేస్తోంది.

అక్సియోమ్ మిషన్ 1 (ఎఎక్స్-1) కోసం ఈ సంస్థ నాసాతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. అంతరిక్షంలోకి వినోద యాత్ర చేయాలంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. భూమి నుంచి ఐఎస్ఎస్‌కు వెళ్లడానికి ఒక్కొక్కరికి రూ.400 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే ఒక్కసారి మిషన్ సక్సెస్ అయితే ముందుముందు ఈ ఖర్చు కొంతవరకూ తగ్గొచ్చు. వచ్చే జనవరికి ముగ్గురు పర్యాటకులు స్పేస్ స్టేషన్‌కు చేరుకోబోతున్నారు.

అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్, టెక్ ఎంటర్‌ప్రెన్యూర్ ల్యారీ కానర్, కెనడా బిజినెస్ మ్యాన్ మార్క్ పాటీ, ఇజ్రాయిల్ పారిశ్రామికవేత్త, ఫైటర్ విమానం మాజీ పైలట్ ఐటన్ స్టిబ్బే.. ఈ ముగ్గురు ఐఎస్ ఎస్ ట్రిప్ కోసం రెడీ అయ్యారు.

ప్రైవేట్ వ్యోమగాములతో.. భూమి కక్ష్యలోకి ప్రయాణించనున్న తొలి మిషన్‌గా ఎఎక్స్-1 రికార్డు సృష్టించబోతుంది. ఈ పర్యాటక బృందానికి నాసాకు చెందిన మాజీ ఆస్ట్రోనాట్ మైఖేల్ లోపేజ్ సారథ్యం వహించనున్నారు. దీనికోసం వాడే రాకెట్ లేదా అంతరిక్ష నౌక పేరు ‘క్రూ డ్రాగన్’ ఇది స్పేస్ ఎక్స్ సంస్థ తయారు చేస్తోంది.

First Published:  30 Jan 2021 2:52 AM GMT
Next Story