Telugu Global
Cinema & Entertainment

ఈ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు!

జెమినీ ఛానెల్ కు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు భలేగా దొరికాయి. రేటింగ్ తగ్గిన ప్రతిసారి ఈ ఛానెల్, ఈ సినిమాల్ని ప్రసారం చేస్తుంది. అలా ప్రసారం చేసిన ప్రతిసారి.. ఛానెల్ నమ్మకాన్ని నిలబెడుతున్నాయి ఈ సినిమాలు. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా మరోసారి జెమినీని మూవీస్ విభాగంలో టాప్ లో నిలబెట్టింది. మహేష్ హీరోగా నటించిన ఈ సినిమాను ఇప్పటికే పలుమార్లు టెలికాస్ట్ చేశారు. ప్రసారం చేసిన ప్రతిసారి కళ్లుచెదిరే రేటింగ్ సాధిస్తోంది ఈ […]

ఈ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు!
X

జెమినీ ఛానెల్ కు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాలు భలేగా దొరికాయి. రేటింగ్ తగ్గిన
ప్రతిసారి ఈ ఛానెల్, ఈ సినిమాల్ని ప్రసారం చేస్తుంది. అలా ప్రసారం చేసిన ప్రతిసారి.. ఛానెల్
నమ్మకాన్ని నిలబెడుతున్నాయి ఈ సినిమాలు. తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమా మరోసారి జెమినీని
మూవీస్ విభాగంలో టాప్ లో నిలబెట్టింది.

మహేష్ హీరోగా నటించిన ఈ సినిమాను ఇప్పటికే పలుమార్లు టెలికాస్ట్ చేశారు. ప్రసారం చేసిన ప్రతిసారి
కళ్లుచెదిరే రేటింగ్ సాధిస్తోంది ఈ సినిమా. తాజాగా మరోసారి ఈ సినిమాను ప్రసారం చేయగా.. ఈసారి
కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఏకంగా 10 టీఆర్పీ రావడం విశేషం.

బుల్లితెర వీక్షకులు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలంటే ఎంతలా ఇష్టపడుతున్నారో
తాజా రేటింగ్ తో మరోసారి రుజువైంది. వీటి హవా ఇప్పట్లో తగ్గదని స్వయంగా ట్రేడ్ పండిట్స్
చెబుతున్నారు. కనీసం మరో 6 నెలల పాటు ఈ రెండు సినిమాలు హయ్యస్ట్ రేటింగ్స్ సాధిస్తాయని
విశ్లేషిస్తున్నారు.

First Published:  29 Jan 2021 8:12 AM GMT
Next Story