Telugu Global
National

అటు వ్యాక్సిన్ డోసు.. ఇటు భార్య ఫుల్ డోసు..

దేశంలో ప్రముఖ వైద్య నిపుణులుగా పేరున్న డాక్టర్ కెకె అగర్వాల్, మీనా అగర్వాల్ దంపతులు కొవిడ్ వ్యాక్సిన్ కారణంగా మరోసారి టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యారు. కొవిడ్ వ్యాక్సిన్ ఆ భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టడం, వారి ఫోన్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అగర్వాల్ దంపతుల పేరు మారుమోగిపోతోంది. అసలేం జరిగింది.. పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె.కె.అగర్వాల్ ఇటీవల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఆయన తన భార్య మీనా […]

అటు వ్యాక్సిన్ డోసు.. ఇటు భార్య ఫుల్ డోసు..
X

దేశంలో ప్రముఖ వైద్య నిపుణులుగా పేరున్న డాక్టర్ కెకె అగర్వాల్, మీనా అగర్వాల్ దంపతులు కొవిడ్ వ్యాక్సిన్ కారణంగా మరోసారి టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యారు. కొవిడ్ వ్యాక్సిన్ ఆ భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టడం, వారి ఫోన్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అగర్వాల్ దంపతుల పేరు మారుమోగిపోతోంది.

అసలేం జరిగింది..
పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె.కె.అగర్వాల్ ఇటీవల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఆయన తన భార్య మీనా అగర్వాల్ కి చెప్పకుండా ఒంటరిగా వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న డాక్టర్ సైలెంట్ గా ఉండకుండా.. ఫేస్ బుక్ లైవ్ లో.. తాను వ్యాక్సిన్ వేయించుకున్నానని, సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ లేవని సెలవిచ్చారు. ఈ లైవ్ చూసిన భార్యకు ఒళ్లుమండింది. వెంటనే ఫోనందుకుంది. లైవ్ లో ఉన్నాను ఒక్కనిమిషం.. అంటూ ఫోన్ పెట్టేద్దామనుకున్న డాక్టర్ గారిపై తిట్లవర్షం కురిసింది. అసలు నాకు చెప్పకుండా ఎందుకు వ్యాక్సిన్ వేయించుకున్నావంటూ చెడామడా వాయించేసింది భార్య డాక్టర్ మీనా అగర్వాల్. ఈ తిట్ల వ్యవహారం కూడా లైవ్ లో వెళ్లిపోవడం, ఆ వీడియో వైరల్ కావడంతో అగర్వాల్ దంపతుల వ్యాక్సిన్ వ్యవహారం టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది.

వైరల్ వీడియోపై డాక్టర్ వివరణ ఇదీ..!
ఫోన్లో భార్య వాయించిన విషయం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారడంతో కెకె అగర్వాల్ ఖంగుతిన్నారు. తన భార్యకు తనంటే ఎంతో ప్రేమ అని, తాను వ్యాక్సిన్ వేయించుకుంటున్న సమయంలో భార్య పక్కనే ఉండాలని అనుకుందని, అలా జరగనందుకే ఆమెకు కోపం వచ్చిందని చెప్పుకుంటున్నారు. వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే తనని జాగ్రత్తగా చూసుకోడానికి ఆమెను పిలవలేదని ఫీలయ్యారని వివరణ ఇచ్చారు.

డాక్టర్ గారు ఏం చేసినా సెన్సేషనే..
డాక్టర్ కెకె అగర్వాల్ కి వైద్యరంగంలో మంచి పేరుంది. అయితే ఆయన లైవ్ లో చాలా తమాషాలు చేస్తుంటారు కూడా. డాక్టర్లతో జరిగే వెబినార్లలో ఆయన చిత్ర విచిత్రమైన వేషాలతో కనపడేవారు. బార్బర్ షాప్ లో మసాజ్ చేయించుకుంటూనే ఆయన వెబినార్లలో పాల్గొన్న వీడియోలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. ఆమధ్య కరోనా టైమ్ లో మోదీ దీపాల కాన్సెప్ట్ కి సైంటిఫిక్ రీజన్ చెప్పి నవ్వులపాలయ్యారు అగర్వాల్. మొత్తమ్మీద కొవిడ్ వ్యాక్సిన్ డోసు, అటు భార్య ఫుల్ డోస్ తో.. అగర్వాల్ పేరు మారుమోగిపోయింది.

First Published:  29 Jan 2021 12:54 AM GMT
Next Story