Telugu Global
National

కోలుకుంటున్న శశికళ..

జయలలిత నెచ్చెలి శశికళ ఆరోగ్యం కొంత కుదుటపడిందని సమాచారం. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 27 న ఆమె విడుదల కావాల్సి ఉంది. ఆమె విడుదల సందర్భంగా అనుచరులు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కుడా చేశారు. అయితే ఇంతలోనే శశికళ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​ అని తేలింది. […]

కోలుకుంటున్న శశికళ..
X

జయలలిత నెచ్చెలి శశికళ ఆరోగ్యం కొంత కుదుటపడిందని సమాచారం. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 27 న ఆమె విడుదల కావాల్సి ఉంది. ఆమె విడుదల సందర్భంగా అనుచరులు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కుడా చేశారు. అయితే ఇంతలోనే శశికళ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​ అని తేలింది. దీంతో శశికళను ఐసీయూలో ఉంచి చికిత్స నందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్టు సమాచారం.

ఈనెల 27తో ఆమె జైలు శిక్ష ముగిసినప్పటికీ .. ఆమె మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండక తప్పని పరిస్థితి నెలకొన్నది. కరోనా కారణంగా ఆమె మరో రెండువారాల పాటు క్వారంటైన్​లో ఉండాల్సి వస్తున్నది. కరోనా నెగిటివ్​ వచ్చాక ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉంది.

శశికళ రాకకోసం ఆమె అనుచరులు వేచిచూస్తున్నారు. ఆమె జైలు నుంచి విడుదల అయితే తమిళనాడు రాజకీయాల్లో మార్పులు వస్తాయని చెబుతున్నారు. కాగా శశికళను తిరిగి అన్నా డీఎంకేలోకి చేర్చుకొనే అవకాశమే లేదని సీఎం పళనిస్వామి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శశికళ తర్వాత స్టెప్​ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ యోచిస్తున్నది. శశికళను అన్నాడీఎంకేలోకి తీసుకొచ్చి ఆమెకు మద్దతు ఇవ్వాలని బీజేపీ ప్లాన్ వేసిందన్న వార్తలు వస్తున్నాయి. గతంలో శశికళను జైలుకు పంపించడం వెనుక బీజేపీ ఉందన్న వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

First Published:  25 Jan 2021 10:31 AM GMT
Next Story