Telugu Global
Health & Life Style

వర్క్ ఫ్రమ్ సైకిల్ ట్రిప్

లాక్‌డౌన్‌తో ప్రపంచంలోని చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చాయి. కొన్ని కంపెనీలు 2021 మార్చి వరకు ఇస్తే మరికొన్ని ఏకంగా లైఫ్ ‌టైమ్ ఆఫర్ ఇచ్చాయి. అయితే ఈ అవకాశాన్ని చాలా డిఫరెంట్‌గా వాడుకున్నారు మహారాష్ట్రలోని ముగ్గురు టెకీలు. ఎలాగంటే.. మహారాష్ట్రకు చెందిన బకెన్ జార్జ్, అల్విన్ జోసెఫ్, రతీష్ భలేరావ్‌ అనే ముగ్గురు మంచి స్నేహితులు. ఇందులో బకెన్ జార్జ్‌కు సైకిల్‌పై టూర్స్ చేయడం అంటే ఇష్టం. లాక్‌డౌన్ టైంలో కొన్నాళ్లు సైకిల్ […]

వర్క్ ఫ్రమ్ సైకిల్ ట్రిప్
X

లాక్‌డౌన్‌తో ప్రపంచంలోని చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చాయి. కొన్ని కంపెనీలు 2021 మార్చి వరకు ఇస్తే మరికొన్ని ఏకంగా లైఫ్ ‌టైమ్ ఆఫర్ ఇచ్చాయి. అయితే ఈ అవకాశాన్ని చాలా డిఫరెంట్‌గా వాడుకున్నారు మహారాష్ట్రలోని ముగ్గురు టెకీలు. ఎలాగంటే..

మహారాష్ట్రకు చెందిన బకెన్ జార్జ్, అల్విన్ జోసెఫ్, రతీష్ భలేరావ్‌ అనే ముగ్గురు మంచి స్నేహితులు. ఇందులో బకెన్ జార్జ్‌కు సైకిల్‌పై టూర్స్ చేయడం అంటే ఇష్టం. లాక్‌డౌన్ టైంలో కొన్నాళ్లు సైకిల్ యాత్రలకు దూరంగా ఉన్న జార్జ్.. అన్ లాక్ పీరియడ్ మొదలవగానే మరోసారి సైకిల్ టూర్ వెయ్యాలనుకున్నాడు. దానికోసం అంతా సిద్ధం చేసుకున్నాడు. ఈ సారి వాళ్లిద్దరు దోస్తులకు కూడా ఈ ఐడియా చెప్పాడు. అయితే వర్క్ వదిలేయకుండా వర్క్ చేస్తూనే ట్రిప్ చేద్దాం అని ముగ్గురు డిసైడ్ అయ్యారు. అలా వర్క్ ఫ్రమ్ సైకిల్ ట్రిప్ ను మొదలుపెట్టారు.

వీళ్ల ట్రిప్ నవంబర్ చివర్లో ముంబై నుంచి స్టార్ట్ అయింది. దారి మధ్యలో అక్కడక్కడా స్టే చేస్తూ.. ఆఫీస్ వర్క్ పూర్తి చేస్తారు. అలా ఈ ముగ్గురు స్నేహితులు నెల రోజుల పాటు ఆడుతూ పాడుతూ..పనిచేస్తూ, ఓ అడ్వెంచర్ ట్రిప్‌ను పూర్తి చేశారు. డైలీ 80 కిలోమీటర్లు ప్రయాణించేవారు. అలా నెలరోజుల్లో ముంబై టూ కన్యాకుమారి 1687 కిలోమీటర్లు సైకిల్ తొక్కి, టూర్ పూర్తి చేశారు.

First Published:  22 Jan 2021 3:28 AM GMT
Next Story