Telugu Global
National

టీకా వేసుకున్నాక ఈ సమస్యలు ఉంటాయ్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. దేశ వ్యాప్తంగా ఈ రోజు నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలవుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 3006 వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు ప్రతి సెంటర్లో 100 మందికి టీకా ఇస్తారు. దేశవ్యాప్తంగా 1075 కాల్ సెంటర్ ద్వారా […]

టీకా వేసుకున్నాక ఈ సమస్యలు ఉంటాయ్
X

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. దేశ వ్యాప్తంగా ఈ రోజు నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలవుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 3006 వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు ప్రతి సెంటర్లో 100 మందికి టీకా ఇస్తారు. దేశవ్యాప్తంగా 1075 కాల్ సెంటర్ ద్వారా టీకా పంపిణీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అయితే వ్యాక్సిన్ కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు పంపింది. కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్.. ఈరెండు టీకాలను ఏ పరిస్థితుల్లో తయారు చేశారు ఏ రకం టీకా, ఎంత డోసు ఇవ్వాలి, ఎవరికి టీకా ఇవ్వాలి?, ఎవరికి ఇవ్వకూడదు? టీకాలను ఎలా నిల్వ చేయాలి, ఎలాంటి ఎఫెక్ట్స్ కనిపిస్తాయి? అలాంటప్పుడు ఏం చేయాలి? లాంటి వివరాలన్నీ ఫ్యాక్ట్‌షీట్‌ రూపంలో పంపారు.

వీళ్లకు ఓకే..
టీకాను 18 ఏళ్ల వయసు నిండిన వారికి మాత్రమే ఇవ్వాలి. ఒక టీకా తీసుకున్న తర్వాత ఇతర టీకాలు తీసుకోవడానికి కనీసం 14 రోజుల గ్యాప్ ఉండాలి. మొదటి డోసుగా ఏ టీకా తీసుకుంటే రెండో డోసు కూడా అదే టీకా ఇవ్వాలి. కోవ్యాగ్జిన్ తీసుకుంటే రెండో డోసు కూడా కోవ్యాగ్జిన్ నే వేయాలి. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారికి, గతంలో కొవిడ్‌ వచ్చి తగ్గినవారికి, గుండె, ఊపిరితిత్తులు, మెదడు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి కూడా టీకా ఇవ్వొచ్చు.

వీళ్లకు వద్దు..
ఫుడ్ అలర్జీ, ఇతర అలర్జీలు ఉన్నవారికి టీకా వేయకూడదు. అలాగే గర్భిణులు, పాలిచ్చే తల్లులపై కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ జరగలేదు కాబట్టి వారిపై టీకా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలీదు. కాబట్టి వారికి వ్యాక్సిన్‌ వేయకూడదు. గతంలో ట్రయల్స్‌లో పాల్గొని, టీకా డోసు తీసుకుని అలర్జీ వచ్చినవారికి కూడా టీకా వేయకూడదు.

జాగ్రత్తలతో..
బ్లీడింగ్‌ డిజార్డర్స్‌, ప్లేట్ లెట్ డిజార్డర్స్ లాంటి సమస్యలు ఉన్నవారికి వ్యాక్సిన్ వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్. కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారికి, కరోనా వచ్చి ట్రీట్ మెంట్ తీసుకున్నవారికి టీకా వేయకూడదు. అలాంటి వాళ్లు కరోనా నుంచి కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాత మాత్రమే టీకా ఇవ్వాలి.
ఎఫెక్ట్స్ కామన్
కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్ టీకాల్లో ఏదైనా వేసుకున్న తర్వాత కొద్దిపాటు లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, కండరాల నొప్పి, దురద వంటి లాంటి చిన్న చిన్న సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తేనే వ్యాక్సిన్‌ పనిచేస్తున్నట్టుగా భావించాలి. ఎవరికైనా సమస్య తీవ్రమైతే వెంటనే చికిత్స తీసుకోవాలి. దానికోసం టీం రెడీగా ఉంటుంది.

లక్షణాలు ఇవీ..
కొవిషీల్డ్‌
టీకా వేసిన దగ్గర నొప్పి, చర్మం సున్నితంగా మారటం, తలనొప్పి, జ్వరం, చలి, అలసట, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, కడుపులో వికారం.

కొవాగ్జిన్‌
టీకా వేసిన ప్లేస్ లో నొప్పి, చర్మం సున్నితంగా మారటం, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట, జ్వరం, కడుపులో వికారం, వాంతులు, చమట పట్టడం, జలుబు, దగ్గు, వణుకు.

First Published:  15 Jan 2021 11:54 PM GMT
Next Story