Telugu Global
NEWS

బీజేపీతో తాడోపేడో తేల్చుకోవడానికి పవన్​ సిద్ధమయ్యాడా?

తిరుపతి ఉప ఎన్నికల్లో కచ్చితంగా పోటీచేయాలని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ భావిస్తున్నాడట. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సీటు బీజేపీకి వదులుకోవద్దని ఆయన భావిస్తున్నారట. అయితే బీజేపీ తిరుపతి సీటును పవన్​ కోసం వదులుకుంటుందా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. నిజానికి పవన్​ కల్యాణే.. బీజేపీతో పొత్తుపెట్టుకున్నాడు. ఇందుకోసం ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. అయితే ఏపీలో పట్టులేని బీజేపీ.. పవన్​తో పొత్తుకోసం అంగీకరించింది. అయితే బీజేపీ రాష్ట్రనేతలు పవన్​ కల్యాణ్​తో ఏమేరకు కలిసి పనిచేస్తున్నారో తెలియడం […]

బీజేపీతో తాడోపేడో తేల్చుకోవడానికి పవన్​ సిద్ధమయ్యాడా?
X

తిరుపతి ఉప ఎన్నికల్లో కచ్చితంగా పోటీచేయాలని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ భావిస్తున్నాడట. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సీటు బీజేపీకి వదులుకోవద్దని ఆయన భావిస్తున్నారట. అయితే బీజేపీ తిరుపతి సీటును పవన్​ కోసం వదులుకుంటుందా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. నిజానికి పవన్​ కల్యాణే.. బీజేపీతో పొత్తుపెట్టుకున్నాడు. ఇందుకోసం ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. అయితే ఏపీలో పట్టులేని బీజేపీ.. పవన్​తో పొత్తుకోసం అంగీకరించింది.

అయితే బీజేపీ రాష్ట్రనేతలు పవన్​ కల్యాణ్​తో ఏమేరకు కలిసి పనిచేస్తున్నారో తెలియడం లేదు. ఇంతవరకు ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్మించలేదు. ఓ వైపు తన పంథాలో తాను పవన్​ కల్యాణ్​ రైతు యాత్రలు చేసుకుపోయాడు. బీజేపీ కూడా సొంతంగానే ముందుకు వెళ్తున్నది. ఎప్పుడో ఓసారి మాత్రమే ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి.

మరోవైపు చాలామంది జనసేన కార్యకర్తలకు బీజేపీతో పొత్తు ఇష్టమే లేదు. సోషల్​మీడియాలో, జనసేన గ్రూపుల్లో పెట్టే కామెంట్లు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. గతంలో పవన్​కల్యాణ్​ సీపీఐ, బీఎస్​పీ లాంటి ప్రోగ్రెసివ్​ భావాలు ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం.. వెంటనే బీజేపీతో పొత్తుపెట్టుకోవడం కూడా పలు విమర్శలకు తావిచ్చింది.

అయితే ప్రస్తుతం ఏపీలో తిరుపతి ఉప ఎన్నిక ముంచుకొచ్చింది. ఈ ఎన్నికల్లో గెలుపొంది ఎలాగైనా సత్తా చాటాలని టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే బీజేపీ .. జనసేన పొత్తుపెట్టుకోవడంతో.. ఏ పార్టీ పోటీచేస్తుందో? అన్న విషయం సస్పెన్స్​గా మారింది.

గతంలో తిరుపతిలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. తమ పార్టీ అభ్యర్థే తిరుపతిలో పోటీచేస్తారని స్పష్టం చేశారు. జనసేన కూడా తమకే మద్దతు ఇస్తుందని చెప్పారు. వీర్రాజు ప్రకటనతో జన సైనికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

తాము ఇప్పటికే జీహెచ్​ఎంసీలోనూ బీజేపీ కోసం పోటీచేయలేదని.. ఇప్పుడు కూడా సీటును త్యాగం చేయాలా? అంటూ వాళ్లు ప్రశ్నించారు. మరోవైపు గతంలో తిరుపతి నుంచి ప్రజారాజ్యం తరఫున పోటీచేసిన చిరంజీవి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని జనసైనికుల వాదన. ఈ నేపథ్యంలో పోటీకి తమకే అవకాశం ఇవ్వాలని వాళ్లు కోరుతున్నారు. ఈ నెల 21న పవన్​కల్యాణ్​ తిరుపతిలో పర్యటించనున్నారు. అక్కడే పార్టీ ముఖ్యులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది.

First Published:  16 Jan 2021 7:56 AM GMT
Next Story