Telugu Global
National

యడ్యూరప్ప దళంలోకి కొత్త రిక్రూట్​మెంట్లు

కర్ణాటక రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. అధికార పార్టీ మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతున్న వేళ అసమ్మతి నేతల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రివర్గంలో ఏడుగురికి కొత్తగా అవకాశం కల్పించడానికి బీజేపీ సిద్ధమైంది. అధిష్టానం అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎవరెవరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే విషయంపై జాతీయ నాయకత్వం క్లారిటీకి వచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి యడ్యూరప్ప వెల్లడించారు. ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజు, ఉమేష్ కత్తి, అరవింద్ లింబావలి, మురుగేష్ నిరానీ, ఆర్ శంకర్, అంగర ఎస్‌, సీపీ […]

యడ్యూరప్ప దళంలోకి కొత్త రిక్రూట్​మెంట్లు
X

కర్ణాటక రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. అధికార పార్టీ మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతున్న వేళ అసమ్మతి నేతల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. మంత్రివర్గంలో ఏడుగురికి కొత్తగా అవకాశం కల్పించడానికి బీజేపీ సిద్ధమైంది. అధిష్టానం అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎవరెవరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలనే విషయంపై జాతీయ నాయకత్వం క్లారిటీకి వచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి యడ్యూరప్ప వెల్లడించారు.

ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజు, ఉమేష్ కత్తి, అరవింద్ లింబావలి, మురుగేష్ నిరానీ, ఆర్ శంకర్, అంగర ఎస్‌, సీపీ యోగేశ్వరలను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. బుధవారం ఈ ఏడుగురూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ వజూభాయ్ వాలా వారితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి యడియూరప్పతో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు.

ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంత్రివర్గ విస్తరణ కోసం చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. కానీ… అధిష్టానం ఆమోదం లభించకపోవడంతో విస్తరణ వాయిదాపడుతూ వచ్చింది. తొలుత మంత్రివర్గంలోకి సునీల్ కుమార్‌, రేణుకాచార్య, బసనగౌడ పాటిల్, ఎస్ఆర్ విశ్వనాథ, మునిరత్నను తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ… చివరకు కొత్త మెహాలు తెరమీదికివచ్చాయి. అధిష్టానం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది.

మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో అధికార పార్టీలో అసమ్మతి రాజుకుంది. ఆవావహులు అధిష్టానం నిర్ణయం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవిని ఆశించి భంగపడ్డ మునిరత్న కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. గత ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామనే హామీతోనే తాను బీజేపీలో చేరినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తాజా పరిణామాలతో అతడు అధిష్టానం పట్ల ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నిన్నామొన్నటి దాకా అవినీతి ఆరోపణలతో బిక్కుబిక్కుమన్న యడ్యూరప్ప ఇప్పుడు తన సైన్యాన్ని పెంచుకుంటున్నాడు. మరి అసంతృప్తుల నడుమ జరుగుతున్న మంత్రివర్గ విస్తరణ ఎటు దారితీస్తుందో చూడాలి.

First Published:  13 Jan 2021 4:50 AM GMT
Next Story