Telugu Global
National

వస్తావా తలైవా..

రజినీకాంత్ పార్టీ పెట్టట్లేదు అని తేల్చి చెప్పిన తర్వాత, ఆయన స్వభావం తెలిసినవారెవరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు. అయితే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ సినిమా డైలాగులు కొట్టిన రోజుల వ్యవధిలోనే రజినీ చేతులెత్తేసరికి అభిమానులే కాస్త షాకయ్యారు. ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నారు కదా, అభిమాన నాయకుడి ఆరోగ్యమే మనకు కావాల్సింది అని సర్దిచెప్పుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ అభిమానుల్లో సందడి మొదలైంది. తలైవా కోలుకున్నారు, ఇక రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. రావయ్యా తలైవా అంటూ […]

వస్తావా తలైవా..
X

రజినీకాంత్ పార్టీ పెట్టట్లేదు అని తేల్చి చెప్పిన తర్వాత, ఆయన స్వభావం తెలిసినవారెవరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు. అయితే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అంటూ సినిమా డైలాగులు కొట్టిన రోజుల వ్యవధిలోనే రజినీ చేతులెత్తేసరికి అభిమానులే కాస్త షాకయ్యారు. ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నారు కదా, అభిమాన నాయకుడి ఆరోగ్యమే మనకు కావాల్సింది అని సర్దిచెప్పుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ అభిమానుల్లో సందడి మొదలైంది. తలైవా కోలుకున్నారు, ఇక రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. రావయ్యా తలైవా అంటూ వందలమంది ప్లకార్డులతో రోడ్లెక్కుతున్నారు. ఒకటీ రెండు రోజులు రోడ్డెక్కి నినాదాలు చేస్తే పర్లేదు.. రోజుల తరబడి ఈ వ్యవహారం కొనసాగితేనే ఇబ్బంది.

కచ్చితంగా రజినీకాంత్ స్పందించాల్సిన సందర్భం ఇది. పార్టీ పెట్టే ప్రసక్తే లేదు అని మరోసారి గట్టిగా అయినా చెప్పాలి, లేదు మీరంతా పలానా పార్టీకి మద్దతివ్వండని అయినా ఉపదేశం ఇవ్వాలి. లోకపోతే మనసు మార్చుకున్నాను, పార్టీ పెడతానని అయినా చెప్పాలి. మొత్తానికి రజినీ నోరు మాత్రం విప్పాలి. ఆ అవసరం ఇప్పుడు మరోసారి వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో లాగా ప్రెస్ నోట్ తో సరిపెడితే సరిపోయే వ్యవహారం కాదు, కచ్చితంగా బైటకొచ్చి మాట్లాడితేనే అభిమానులకు గురి కుదురుతుంది. అందుకే పార్టీపై రజినీ తేల్చేసినా కూడా ఇంకా వారు వెంటపడుతున్నారు, తమ డిమాండ్లు వినిపిస్తున్నారు.

రావయ్యా తలైవా అంటూ కొన్నిరోజులుగా చెన్నైలోని వళ్లువర్ కోట్టం వద్ద వందల సంఖ్యలో అభిమానులు గుమికూడి నినాదాలు చేస్తున్నారు. వీరిని ఎవరూ వెనకుండి నడిపించడంలేదు, స్వచ్ఛందంగా అందరూ బయటకొస్తున్నారు. అయితే ఈ ఉద్యమం పెరిగి పెద్దదైతేనే ఇబ్బంది. మక్కల్ మన్రం నిర్వాహకులు కూడా చేరి రాష్ట్రవ్యాప్తంగా ఈ డిమాండ్లు పెరిగితే మాత్రం రజినీపై కచ్చితంగా ఒత్తిడి పెరుగుతుంది. పార్టీ పేరు ఖరారు చేశారు, గుర్తు కూడా ఓకే అయింది అనుకుంటున్న టైమ్ లో అసలు పార్టీయే లేదంటూ రజినీ ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సినిమాల్లో హీరోయిజం చూపించే తమ అభిమాన కథానాయకుడు.. రియల్ లైఫ్ లో ఇలా వెనకడుగేయడం వారికి నచ్చలేదు. అందుకే అభిమానులంతా రెండో దఫా రచ్చ చేస్తున్నారు. రావయ్యా తలైవా అంటూ రోడ్లెక్కారు. మరి సూపర్ స్టార్ వీరికి ఏమని సమాధానం చెబుతారో, ఎలా సముదాయిస్తారో వేచి చూడాలి.

First Published:  10 Jan 2021 10:26 PM GMT
Next Story