Telugu Global
Cinema & Entertainment

సమంత గాలి తీసేసిన నాగచైతన్య

ఇంట్లో భార్యాభర్తలు ఎలా మాట్లాడుకుంటారో అందరికీ తెలిసిందే. మరి బయట కూడా అలానే మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? మరీ ముఖ్యంగా కెమెరా ముందు కూడా, ఇంట్లో మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభూతినే ఇచ్చారు రియల్ లైఫ్ భార్యాభర్తలు సమంత-నాగచైతన్య. ఓ టాక్ షోలో వీళ్లిద్దరూ మాట్లాడుకున్న పద్ధతి ఇప్పుడు అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఆహా అనే యాప్ కు శామ్-జామ్ పేరిట సమంత ఓ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ […]

nagachaitanya-samantha
X

ఇంట్లో భార్యాభర్తలు ఎలా మాట్లాడుకుంటారో అందరికీ తెలిసిందే. మరి బయట కూడా అలానే
మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? మరీ ముఖ్యంగా కెమెరా ముందు కూడా, ఇంట్లో మాట్లాడుకున్నట్టే
మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి అనుభూతినే ఇచ్చారు రియల్ లైఫ్ భార్యాభర్తలు
సమంత-నాగచైతన్య. ఓ టాక్ షోలో వీళ్లిద్దరూ మాట్లాడుకున్న పద్ధతి ఇప్పుడు అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.

ఆహా అనే యాప్ కు శామ్-జామ్ పేరిట సమంత ఓ టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షోకు
సంబంధించి ఆఖరి ఎపిసోడ్ ను భర్త నాగచైతన్యతో ప్లాన్ చేసింది సమంత. స్టేజ్ పై రావడమే ఆలస్యం,
సమంతపై కౌంటర్లు అందుకున్నాడు చైతూ. ఎప్పుడూ ఇంట్లో పడుంటాడు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు
వస్తాడని చివర్లో పిలిచారా అంటూ సమంతపై కౌంటర్ వేశాడు.

అక్కడితో ఆగలేదు. వంట విషయంలో తనకు ఎన్ని మార్కులు వేస్తారని సమంత అడిగినప్పుడు, అసలు
వంట చేస్తే కదా ఎన్ని మార్కులు వేయాలో తెలిసేది అంటూ మరో కౌంటర్ ఇచ్చాడు. దాదాపు ఇదే
రకమైన కౌంటర్ ‘ఇల్లు శుభ్రం’ అనే అంశంపై కూడా పడింది.

ఇలా సమంత టాక్ షోలో సమంతనే ఏడిపించాడు నాగచైతన్య. రెగ్యులర్ ఇంటర్వ్యూల్లో భాగంగా ప్రశ్న
అడగడం, సమాధానం ఇవ్వడం లాంటివి లేకుండా.. చాలా వినోదాత్మకంగా, ముచ్చటగా సాగిపోయింది ఆ
ఇంటర్య్యూ. ఇంకా చెప్పాలంటే శామ్-జామ్ టాక్ షోలో ఇప్పటివరకు వచ్చిన ఇంటర్య్యూలేవీ పెద్దగా
ఆకట్టుకోలేదు. చివర్లో వచ్చిన నాగచైతన్య ఎపిసోడ్ తప్ప.

First Published:  10 Jan 2021 4:12 AM GMT
Next Story