Telugu Global
NEWS

'కుట్ర'ను చేధించేందుకు సిట్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విగ్రహాల విధ్వంసం చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఏసీబీ అదనపు డైరెక్టర్ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విగ్రహాల విధ్వంసంపై దర్యాప్తు జరపనున్న సిట్‌లో 16 మంది సభ్యులుగా […]

కుట్రను చేధించేందుకు సిట్ ఏర్పాటు
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విగ్రహాల విధ్వంసం చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఏసీబీ అదనపు డైరెక్టర్ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

విగ్రహాల విధ్వంసంపై దర్యాప్తు జరపనున్న సిట్‌లో 16 మంది సభ్యులుగా ఉండనున్నారు. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన విగ్రహాల ధ్వంసం కేసులపై సిట్ దర్యాప్తు జరపనుంది. ఫొరెన్సిక్, సీఐడీ, సైబర్ క్రైమ్ విభాగాల సహకారంతో సిట్ దర్యాప్తు జరగనుంది. దర్యాప్తుకు సీఐడీ, ఇంటెలిజెన్స్ విభాగాలు సహకరించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఆలయాల మీద దాడులకు సంబంధించి కోర్టుకు సమగ్ర నివేదిక సమర్పించనుంది సిట్.

ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులను ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం వాడుకుంటుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు విగ్రహాల విధ్వంసాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. అధికార పార్టీని హిందూ వ్యతిరేక పార్టీకిగా చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల కుట్రలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. విగ్రహాల విధ్వంసానికి పాల్పడుతున్న వారిని గుర్తించడంతో పాటు, దాడుల వెనక గల కుట్రనూ చేధించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.

ప్రతిపక్షాల వాదనను పూర్వపక్షం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించింది. టీడీపీ హయాంలో తొలగించిన ఆలయాల పునర్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా విజయవాడ దుర్గ ఆలయ అభివృద్ధి కోసం 77 కోట్ల నిధులను కెటాయించింది. పుష్కరాల పేరిట గత ప్రభుత్వం తొలగించిన 40కి పైగా ఆలయాల పునర్ నిర్మాణంలో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 9 ఆలయాలకు శంకుస్థాపన చేశారు. మరోవైపు శ్రీశైల దేవస్థానం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

విగ్రహాల విధ్వంసం చుట్టూ రాజకీయ కుట్ర జరుగుతోందని గుర్తించిన ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మతసామరస్య కమిటీల ఏర్పాటుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మత వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు కొందరు యత్నిస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించిన వెంటనే సిట్ ఏర్పాటు చేయడం గమనార్హం. సిట్ ఏర్పాటుతో విగ్రహాల ధ్వంసాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని అర్థమవుతోంది. ప్రభుత్వం నిర్ణయంతో ప్రతిపక్షాల నోట్ల వెలక్కాయపడ్డట్లయ్యింది.

First Published:  9 Jan 2021 4:16 AM GMT
Next Story