Telugu Global
Others

రైస్‌, రోటీ.. రెండింటిలో ఏది బెస్ట్?

బరువు తగ్గాలనుకునే వాళ్లు చాలామంది రైస్‌కి బదులు రోటీ తింటుంటారు. అయితే రోటీ, చపాతీలు తినడం వల్ల నిజంగా బరువు తగ్గుతారా? రైస్, రోటీల్లో ఏది బరువు తగ్గడానికి అనుకూలం? రెండింటిలో ఎన్నెన్ని క్యాలరీలుంటాయో ఓ సారి చూద్దాం. బియ్యం, గోధుమలు ఈ రెండు మంచి పోషకాలు కలిగిన ఆహారమే. అయితే బరువు తగ్గే విషయంలో ఏది బాగా పని చేస్తుందనే విషయాన్ని చర్చించాలంటే వాటిలోని పోషకాలను లెక్కించాలి. కేలరీలు రైస్, రోటీ రెండింటిలో దాదాపు సమానమైన […]

రైస్‌, రోటీ.. రెండింటిలో ఏది బెస్ట్?
X

బరువు తగ్గాలనుకునే వాళ్లు చాలామంది రైస్‌కి బదులు రోటీ తింటుంటారు. అయితే రోటీ, చపాతీలు తినడం వల్ల నిజంగా బరువు తగ్గుతారా? రైస్, రోటీల్లో ఏది బరువు తగ్గడానికి అనుకూలం? రెండింటిలో ఎన్నెన్ని క్యాలరీలుంటాయో ఓ సారి చూద్దాం.

బియ్యం, గోధుమలు ఈ రెండు మంచి పోషకాలు కలిగిన ఆహారమే. అయితే బరువు తగ్గే విషయంలో ఏది బాగా పని చేస్తుందనే విషయాన్ని చర్చించాలంటే వాటిలోని పోషకాలను లెక్కించాలి.

కేలరీలు
రైస్, రోటీ రెండింటిలో దాదాపు సమానమైన కేలరీలుంటాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తినిస్తాయి. పాలిష్ చేయని బ్రౌన్ రైస్ , గోధుమల కంటే ఎక్కువ కేలరీలను అందిస్తుంది. రోజువారీ కావాల్సిన శక్తిని ఈ రెండు సమపాళ్లలో అందిచగలవు.

పిండి పదార్థాలు
రోటీ, రైస్ రెండింటిలో పిండి పదార్థాలుంటాయి. రోజువారీ ఆహారంలో కనీసం 60 శాతం పిండి పదార్థాలు ఉండాలి. పిండి పదార్థాలు తగినంత తీసుకోపోతే బరువు తగ్గడం సాధ్యం కాదు.

కార్బోహైడ్రేట్స్
శరీరానికి కావల్సిన శక్తిని అందించడంలో కార్బోహైడ్రేట్స్ ముఖ్యమైనవి. రోజంతా మనకి కార్బోహైడ్రేట్స్ అవసరమవుతాయి. కార్బోహైడ్రేట్ కంటెంట్ రైస్ , రోటీల్లో వేర్వేరుగా ఉంటుంది. రోటీల్లో సరైన మోతాదులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి కావల్సిన శక్తితో పాటు, ఫైబర్ లాంటి మిగిలిన పోషకాలను కూడా అందిస్తాయి. కానీ మనం రెగ్యులర్‌‌గా తినే రైస్‌లో మాత్రం ఫైబర్ ఉండదు. కార్బోహైడ్రేట్స్‌తో పాటు పిండిపదార్థాల కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి త్వరగా అరిగిపోయి రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని పెంచడానికి తోడ్పడుతుంది. ఇది షుగర్ సమస్య ఉన్నవాళ్లకు ప్రమాదంగా మారొచ్చు. అందుకే బరువు తగ్గాలనుకునే వాళ్లు రైస్‌ను దూరం పెట్టాలి. అలాగే రైస్‌లో ఉండే అమిలోపెక్టిన్ త్వరగా జీర్ణిమైపోతుంది. అందుకే ఇలాంటి ఆహారం పిల్లలకు చాలామంచిది.

ప్రోటీన్స్
ధాన్యాల్లో ప్రొటీన్స్ తక్కువగా ఉంటాయి. ఒకరకంలో ఇందులో ప్రొటీన్ కంటెంట్ లేనట్టే చెప్పుకోవాలి. కానీ ఇవి ప్రొటీన్స్ యొక్క నాణ్యతను పెంచగలవు. ఉదాహరణకు రోటీ, రైస్ ఈ రెండు పప్పుతో కలిపి తీసుకున్నప్పుడు రైస్‌తో తినడం వల్ల పప్పు యొక్క ప్రొటీన్ మెరుగ్గా శరీరానికి అందుతుంది. అందుకే కండలు పెంచేవారు, ప్రొటీన్ డైట్ తీసుకునే వారు రోటీ కంటే రైస్ ఎంచుకోవడం బెటర్.

ఫైబర్..
రైస్ , రోటీ రెండింటిలో ఫైబర్ కంటెంట్ మెరుగ్గానే ఉంటుంది. అయితే బ్రౌన్ రైస్‌తో పోల్చినా కూడా గోధుమల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అనేది బరువు తగ్గడం, పెరగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారంలో ఫైబర్ ఉంటే రక్తంలో చక్కెరను నెమ్మదిగా గ్రహిస్తుంది. అది ఎక్కువ సేపు ఆకలి వేయకుండా సాయపడుతుంది. అలాగే ఫైబర్ మలబద్దకాన్ని రాకుండా చేస్తుంది. గుండె జబ్బులు, టైప్ -2 డయాబెటిస్, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కూడా సాయపడుతుంది.అందుకే ఫైబర్ విషయానికొస్తే రోటీలను లేదా మిల్లెట్స్‌ను ఎంచుకోవడం బెస్ట్ ఆప్షన్.

ఇకపోతే రోటీ, బియ్యం రెండింటిలో.. శరీరంలో డిఎన్‌ఎ తయారీకి, కొత్త రక్త కణాలు ఏర్పడటానికి అవసరమయ్యే విటమిన్ B ఉంటుంది. అయితే రోటీలో బియ్యం కంటే ఎక్కువ ఫోలేట్, పాస్ఫరస్, ఇతర మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అవసరాన్ని బట్టి రైస్, రోటీల్లో ఎది మనకు సూట్ అవుతుందో తెలుసుకుని ఎంచుకోవాలి.

First Published:  7 Jan 2021 2:24 AM GMT
Next Story