Telugu Global
Health & Life Style

బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కరోనాకు వ్యాక్సిన్ వచ్చి హమ్మయ్య అనుకునే టైంలో కొన్ని చోట్ల బర్డ్ ఫ్లూ అనే భయం వినిపిస్తుంది. రీసెంట్‌గా బర్డ్ ఫ్లూ కేసుల పదుల సంఖ్యలో పెరుగుతున్నాయి. అసలు ఈ బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి చూద్దాం. ఇలా వ్యాపిస్తుంది ఈ వైరస్ కోళ్లు, నీటి కాకులు, బాతులు, కొన్నిరకాల వలస పక్షుల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధి సోకిన పక్షుల నోటి నుంచి వచ్చే స్రావాల నుంచి ఇది […]

బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
X

కరోనాకు వ్యాక్సిన్ వచ్చి హమ్మయ్య అనుకునే టైంలో కొన్ని చోట్ల బర్డ్ ఫ్లూ అనే భయం వినిపిస్తుంది. రీసెంట్‌గా బర్డ్ ఫ్లూ కేసుల పదుల సంఖ్యలో పెరుగుతున్నాయి. అసలు ఈ బర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓసారి చూద్దాం.

ఇలా వ్యాపిస్తుంది
ఈ వైరస్ కోళ్లు, నీటి కాకులు, బాతులు, కొన్నిరకాల వలస పక్షుల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధి సోకిన పక్షుల నోటి నుంచి వచ్చే స్రావాల నుంచి ఇది మనుషులకు వ్యాపిస్తుంది. అలాగే అనారోగ్యంతో ఉన్న పక్షులతో సన్నిహితంగా ఉండట, తాకడం లేదా వాటిని తినడం ద్వారా ఇది వ్యాపించొచ్చు. అందుకే బర్డ్ ఫ్లూ బారిన పడకూడదంటే.. పక్షులు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి అపరిశుభ్ర ప్రదేశాలు, బహిరంగ మార్కెట్ల దగ్గర కూడా కేర్ తీసుకోవాలి.

లక్షణాలివే.
బర్డ్ ఫ్లూలో H5N1, H7N9 అని రెండు రకాలున్నాయి. ఈ రెండు రకాలు మనుషులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. రకాన్ని బట్టి బర్డ్ ఫ్లూలక్షణాలు రెండు నుంచి ఏడు రోజులలో మొదలవుతాయి. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, వాంతులు, విరేచనాలు, కంటి ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల్లో కొన్ని సమస్యలు కనిపించొచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలు తీవ్రంగా కనిపిస్తే వెంటనే డాక్టర్‌‌ని సంప్రదించాలి

ఇలా చేస్తే సేఫ్
ఇది వైరస్ ద్వారా వచ్చే వ్యాధి కాబట్టి ట్రీట్‌మెంట్ ఇంకా అందుబాటులో లేదు. అందుకే అది రాకుండా ఉండాలంటే.. బహిరంగ ప్రదేశాల్లో పక్షులకు, జంతువులకు దూరంగా ఉండాలి. చేతులను తరచూ కడుగుతుండాలి. మాంసాహారాన్ని వండే ముందు వేడినీటితో కడగాలి. చనిపోయిన పక్షులను తాకకూడదు. పచ్చి గుడ్లు తినకూడదు.

First Published:  6 Jan 2021 5:45 AM GMT
Next Story