Telugu Global
Cinema & Entertainment

నిధి అగర్వాల్ ను వేధించిన దర్శకుడు

హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఊహించని విధంగా ఓ చేదు అనుభవం ఎదురైంది. అది కూడా మీడియా, ప్రేక్షకులు ఉన్న స్టేజ్ పై కావడం గమనార్హం. తనకు ఎదురైన చేదు అనుభవం నుంచి ఆమె చాకచక్యంగా బయటపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. శింబుతో కలిసి ఈశ్వరన్ అనే సినిమా చేసింది నిధి అగర్వాల్. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ చెన్నైలో జరిగింది. శింబు ఫ్యాన్స్, మీడియా అంతా ఫంక్షన్ కు వచ్చింది. స్టేజ్ పై నిధి అగర్వాల్ […]

nidhi-agerwal-stills
X

హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఊహించని విధంగా ఓ చేదు అనుభవం ఎదురైంది. అది కూడా మీడియా, ప్రేక్షకులు ఉన్న స్టేజ్ పై కావడం గమనార్హం. తనకు ఎదురైన చేదు అనుభవం నుంచి ఆమె చాకచక్యంగా బయటపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

శింబుతో కలిసి ఈశ్వరన్ అనే సినిమా చేసింది నిధి అగర్వాల్. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ చెన్నైలో జరిగింది. శింబు ఫ్యాన్స్, మీడియా అంతా ఫంక్షన్ కు వచ్చింది. స్టేజ్ పై నిధి అగర్వాల్ మాట్లాడుతోంది. ఇంతలో దర్శకుడు నిధి దగ్గరకొచ్చి చెవిలో ఏదో చెప్పాడు.

ముందు నిధి ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తర్వాత అదే దర్శకుడు మరో 2 సార్లు నిధి దగ్గరకొచ్చి మళ్లీ మళ్లీ ఇబ్బంది పెట్టాడు. దీంతో కాస్త ఇబ్బంది పడినప్పటికీ చిరునవ్వుతోనే తన ప్రసంగాన్ని మధ్యలో ముగించేసిది నిధి అగర్వాల్.

ఇంతకీ ఆ దర్శకుడు ఏం చేశాడంటే.. శింబు మామ ఐ లవ్య్యూ అని చెప్పమన్నాడట. సినిమాలో ఆ డైలాగ్ ఉంది కాబట్టి, స్టేజ్ పై చెబితే బాగా పేలుతుందని దర్శకుడు భావించాడు. కానీ నిధి అగర్వాల్ మాత్రం ఇబ్బంది పడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

First Published:  5 Jan 2021 7:55 AM GMT
Next Story