Telugu Global
Cinema & Entertainment

అల్లుడు అదుర్స్ ట్రయిలర్ రివ్యూ

సంక్రాంతి కానుకగా 15వ తేదీన విడుదలకు సిద్ధమైంది అల్లుడు అదుర్స్ మూవీ. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ-నభానటేష్-అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సంబందించి ఈరోజు ట్రయిలర్ రిలీజైంది. ట్రయిలర్ చూస్తుంటే.. సినిమా మొత్తం కామెడీ, యాక్షన్ తో నిండినట్టు కనిపిస్తోంది. ఇంతకుముందు కందిరీగ, రభస లాంటి సినిమాలు తీశాడు సంతోష్ శ్రీనివాస్. ఆ సినిమాల టైపులోనే అల్లుడు అదుర్స్ కూడా ఎనర్జిటిక్ గా ఉండబోతోందే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. మూవీలో ఇద్దరు మరదళ్ల […]

alludu-adhurs-bellamkonda-nabha-anu-emmanuel
X

సంక్రాంతి కానుకగా 15వ తేదీన విడుదలకు సిద్ధమైంది అల్లుడు అదుర్స్ మూవీ. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ-నభానటేష్-అను ఎమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సంబందించి ఈరోజు ట్రయిలర్ రిలీజైంది. ట్రయిలర్ చూస్తుంటే.. సినిమా మొత్తం కామెడీ, యాక్షన్ తో నిండినట్టు కనిపిస్తోంది.

ఇంతకుముందు కందిరీగ, రభస లాంటి సినిమాలు తీశాడు సంతోష్ శ్రీనివాస్. ఆ సినిమాల టైపులోనే అల్లుడు అదుర్స్ కూడా ఎనర్జిటిక్ గా ఉండబోతోందే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. మూవీలో ఇద్దరు మరదళ్ల మధ్య చిక్కుకున్న బావగా బెల్లంకొండ కనిపిస్తున్నాడు.

నభా నటేష్ పాత్ర ఏంటనేది కాస్త అర్థమయ్యేలా చూపించిన మేకర్స్, అను ఎమ్మాన్యుయేల్ పాత్రను మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. ఇక చాన్నాళ్ల తర్వాత సోనూసూద్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. భారీ తారాగణం నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటికే పాటలకు ఓ మోస్తరుగా రెస్పాన్స్ వచ్చింది. ట్రయిలర్ తో సక్సెస్ అయిన ”అల్లుడు” థియేటర్లలో ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.

First Published:  5 Jan 2021 8:00 AM GMT
Next Story