Telugu Global
Cinema & Entertainment

నవ్వకుండా ఉండడం కష్టమే

‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన నివేత పేతురాజ్… ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం నివేత హీరోయిన్ గా నటించిన రెడ్ సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన నివేత.. రెడ్ సినిమాలో నవ్వకుండా యాక్ట్ చేయడానికి చాలా కష్టపడ్డానంటోంది. “సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో నటించాను. అస్సలు నవ్వకుండా సీరియస్ గా ఉండటం కోసం చాలా కష్టపడ్డాను. ఒరిజినల్ సినిమాలో కంటే రెడ్ […]

nivetha pethuraj
X

‘మెంటల్ మదిలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన నివేత పేతురాజ్… ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం నివేత హీరోయిన్ గా నటించిన రెడ్ సినిమా సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ సందర్భంగా మాట్లాడిన నివేత.. రెడ్ సినిమాలో నవ్వకుండా యాక్ట్ చేయడానికి చాలా కష్టపడ్డానంటోంది.

“సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో నటించాను. అస్సలు నవ్వకుండా సీరియస్ గా ఉండటం కోసం చాలా కష్టపడ్డాను. ఒరిజినల్ సినిమాలో కంటే రెడ్ లో నా రోల్ పెంచారు. సినిమాలో నాకు యాక్షన్ ఎపిసోడ్స్ ఉండవు. అయినా హీరోయిన్స్ కి యాక్షన్ చేయడం కష్టమే.”

ఇలా రెడ్ లో తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది నివేత. తెలుగులో తనకు బ్రేక్ ఇచ్చిన కిషోర్ తిరుమల, వివేక్ ఆత్రేయ గురించి మాట్లాడుతూ.. ఆ ఇద్దరు దర్శకులు స్క్రిప్ట్ చెప్పకపోయినా వాళ్ల సినిమాల్లో నటిస్తానని ప్రకటించింది.

“తెలుగులో వివేక్ ఆత్రేయ, కిషోర్ తిరుమల ఇద్దరూ స్క్రిప్ట్ చెప్పకపోయినా చేస్తా… వాళ్లపై నాకున్న కాన్ఫిడెన్స్ అలాంటిది. నేను వర్క్ చేసిన దర్శకుల్లో వారిద్దరితోనే ఎక్కువగా ట్రావెల్ అయ్యాను. ఇద్దరితో చెరో రెండు సినిమాలు చేయడం సంతోషంగా ఉంది.”

సంక్రాంతి కానుకగా 9న వస్తున్న రెడ్ సినిమా తనకు తెలుగులో మరో హిట్ మూవీగా నిలిచిపోతుందని చెబుతోంది నివేత.

First Published:  4 Jan 2021 8:05 AM GMT
Next Story