Telugu Global
Cinema & Entertainment

పైకి క్లాస్.. లోపల ఊర మాస్

తను ఫ్రేమ్ లో చూడ్డానికి మాత్రమే క్లాస్ గా కనిపిస్తానని, లోపల మొత్తం మాస్ అని అంటోంది హీరోయిన్ నభా నటేష్. దక్షిణాది సినిమాలంటే తనకు చాలా ఇష్టమని, ఇండస్ట్రీకి రాకముందు నుంచే తెలుగు సినిమాలు ఎక్కువగా చూసేదాన్నని చెబుతోంది నభా. తన బ్యాచ్ లో ఎక్కువమంది తెలుగమ్మాయిలే ఉన్నారని.. అలా వాళ్లతో తెలుగు సినిమాలు చూడడం అలవాటు అయిందని చెప్పుకొచ్చింది. బెంగళూరులో రెగ్యులర్ గా తెలుగు సినిమాలు చూడ్డం వల్ల తన లోపల మాస్ ఎలిమెంట్ […]

Nabha Natesh
X

తను ఫ్రేమ్ లో చూడ్డానికి మాత్రమే క్లాస్ గా కనిపిస్తానని, లోపల మొత్తం మాస్ అని అంటోంది హీరోయిన్ నభా నటేష్. దక్షిణాది సినిమాలంటే తనకు చాలా ఇష్టమని, ఇండస్ట్రీకి రాకముందు నుంచే తెలుగు సినిమాలు ఎక్కువగా చూసేదాన్నని చెబుతోంది నభా. తన బ్యాచ్ లో ఎక్కువమంది తెలుగమ్మాయిలే ఉన్నారని.. అలా వాళ్లతో తెలుగు సినిమాలు చూడడం అలవాటు అయిందని చెప్పుకొచ్చింది.

బెంగళూరులో రెగ్యులర్ గా తెలుగు సినిమాలు చూడ్డం వల్ల తన లోపల మాస్ ఎలిమెంట్ వచ్చేసిందని చెబుతోంది నభా నటేష్. పైగా థియేటర్ ఆర్ట్ కూడా నేర్చుకున్నాను కాబట్టి, ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలనని చెబుతోంది.

ఇన్ని విషయాలు చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. పెళ్లిపై మాత్రం అదో రకంగా స్పందించింది. ప్రస్తుతానికి సోలో బ్రతుకే బాగుందంటున్న ఈ బ్యూటీ.. పెళ్లిపై తనకు ఎలాంటి అభిప్రాయం లేదంటోంది. అసలు తనకు పెళ్లి ఆలోచనలు కూడా రావని.. ఆ ఆలోచనలు వచ్చినప్పుడు తన మైండ్ సెట్ ఎలా ఉంటుందో చెప్పలేనని అంటోంది.

First Published:  4 Jan 2021 8:17 AM GMT
Next Story