Telugu Global
Cinema & Entertainment

పవన్ కోసం మార్పుచేర్పులు

అయ్యప్పనుమ్ కోషియమ్ అనే సినిమా రీమేక్ లో నటించబోతున్నాడు పవన్. ఈ సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అందులో కూడా పవన్ ది పోలీస్ పాత్రే. ఇలా ఒకేసారి రెండు సినిమాల్లో పోలీస్ పాత్రలు చేయడం కరెక్ట్ కాదు. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో పోలీస్ పాత్రకు మార్పుచేర్పులు చేయడం కుదరదు. ఎందుకంటే అది రీమేక్ మూవీ. ఎక్కువ మార్పులు చేస్తే మొదటికే […]

పవన్ కోసం మార్పుచేర్పులు
X

అయ్యప్పనుమ్ కోషియమ్ అనే సినిమా రీమేక్ లో నటించబోతున్నాడు పవన్. ఈ సినిమాలో పోలీసాఫీసర్
పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా
చేయబోతున్నాడు. అందులో కూడా పవన్ ది పోలీస్ పాత్రే. ఇలా ఒకేసారి రెండు సినిమాల్లో పోలీస్
పాత్రలు చేయడం కరెక్ట్ కాదు.

అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లో పోలీస్ పాత్రకు మార్పుచేర్పులు చేయడం కుదరదు. ఎందుకంటే
అది రీమేక్ మూవీ. ఎక్కువ మార్పులు చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం. దీంతో తప్పనిసరి
పరిస్థితుల మధ్య హరీశ్ శంకర్ సినిమాకే రిపేర్లు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం హరీశ్ అదే పని మీద
ఉన్నాడు.

తన సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ పాత్రను మించి కనిపిస్తాడని చెబుతున్నాడు హరీష్. యూనిఫాం వేసుకోకపోయినా.. పోలీస్ కంటే పవర్ ఫుల్ గా కనిపిస్తాడని చెబుతున్నాడు. ఈ మేరకు మార్పుచేర్పులకు శ్రీకారం చుట్టిన ఈ దర్శకుడు.. వేసవి నుంచి పవన్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తానని చెబుతున్నాడు.

First Published:  2 Jan 2021 7:44 AM GMT
Next Story