Telugu Global
Cinema & Entertainment

సంక్రాంతికి సినిమా కాదు, టీజర్

వకీల్ సాబ్ సినిమా సంక్రాంతికి వస్తుందంటూ మొన్నటివరకు ప్రచారం జరిగింది. ఎప్పుడైతే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయకుండా దాచిపెట్టారో, అప్పుడే ఇక సినిమా సంక్రాంతికి రాదని అంతా ఫిక్స్ అయిపోయారు. అలా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈ సినిమా, సంక్రాంతి సీజన్ ను మాత్రం మిస్ చేసుకోలేదు. అవును.. సంక్రాంతికి వకీల్ సాబ్ హంగామా ఉంది. దాదాపు 3 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా టీజర్ […]

సంక్రాంతికి సినిమా కాదు, టీజర్
X

వకీల్ సాబ్ సినిమా సంక్రాంతికి వస్తుందంటూ మొన్నటివరకు ప్రచారం జరిగింది. ఎప్పుడైతే నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయకుండా దాచిపెట్టారో, అప్పుడే ఇక సినిమా సంక్రాంతికి రాదని అంతా ఫిక్స్ అయిపోయారు. అలా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఈ సినిమా, సంక్రాంతి సీజన్ ను మాత్రం మిస్ చేసుకోలేదు.

అవును.. సంక్రాంతికి వకీల్ సాబ్ హంగామా ఉంది. దాదాపు 3 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా టీజర్ ను ఎట్టకేలకు సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు యూనిట్ నుంచి ప్రకటన వచ్చేసింది.

పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ పై భారీ అంచనాలున్నాయి. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. వేణు శ్రీరామ్ ఈ రీమేక్ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు

First Published:  1 Jan 2021 6:54 AM GMT
Next Story