Telugu Global
Cinema & Entertainment

నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశాడు. కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. కిడ్నీలు రెండూ ఫెయిల్ అయ్యాయి. వైద్యులు డయాలసిస్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత విషమించడంతో, హార్ట్ ఎటాక్ వచ్చి నిన్న రాత్రి కన్నుమూశారు నర్సింగ్ యాదవ్. 52 ఏళ్ల నర్సింగ్ యాదవ్ కు భార్య, కుమారుడు ఉన్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో దాదాపు 300 సినిమాలు చేశారు నర్సింగ్ యాదవ్. సైడ్ క్యారెక్టర్ రోల్స్ నుంచి మెయిన్ […]

Artist Narsing Yadav Passed away (1)
X

ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశాడు. కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. కిడ్నీలు రెండూ ఫెయిల్ అయ్యాయి. వైద్యులు డయాలసిస్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత విషమించడంతో, హార్ట్ ఎటాక్ వచ్చి నిన్న రాత్రి కన్నుమూశారు నర్సింగ్ యాదవ్.

52 ఏళ్ల నర్సింగ్ యాదవ్ కు భార్య, కుమారుడు ఉన్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో దాదాపు 300 సినిమాలు చేశారు నర్సింగ్ యాదవ్. సైడ్ క్యారెక్టర్ రోల్స్ నుంచి మెయిన్ విలన్ స్థాయికి ఎదిగి, ఆ తర్వాత ఫుల్ లెంగ్త్ కమెడియన్ గా మారారు. విలక్షణ తెలంగాణ యాసతో డైలాగులు చెప్పే నర్సింగ్ యాదవ్ కు ప్రత్యేకంగా అభిమానులున్నాయి.

విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన హేమాహేమీలు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు నర్సింగ్ యాదవ్. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలతో పాపులర్ అయ్యారు. ఇక అక్కడ్నుంచి నర్సింగ్ యాదవ్ కు ప్రత్యేకంగా పాత్రలు తయారుచేయడం స్టార్ట్ చేశారు మేకర్స్. అలా తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు, ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు నర్సింగ్ యాదవ్.

First Published:  1 Jan 2021 6:29 AM GMT
Next Story