Telugu Global
Cinema & Entertainment

క్రాక్ సినిమాకు అదే శ్రీరామరక్ష

దాదాపు మూడేళ్లుగా రవితేజ సినిమాలు ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. అతడు తన కథలు, పాత్రలు మార్చాల్సిన ఆవశ్యకతను చాటిచెబుతున్నాయి. ఇలాంటి డైలమాలో రవితేజ నుంచి వస్తున్న సినిమా క్రాక్. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉంది యూనిట్. ఇటు ప్రేక్షకులు కూడా రవితేజ ఈసారి కొత్తగా ఏదైనా ట్రై చేసి ఉంటాడని అనుకున్నారు. కానీ ఈరోజు రిలీజైన ట్రయిలర్ చూస్తే మరోసారి రవితేజ సెలక్షన్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తిగా మాస్ ఎలిమెంట్స్ […]

క్రాక్ సినిమాకు అదే శ్రీరామరక్ష
X

దాదాపు మూడేళ్లుగా రవితేజ సినిమాలు ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. అతడు తన కథలు, పాత్రలు మార్చాల్సిన ఆవశ్యకతను చాటిచెబుతున్నాయి. ఇలాంటి డైలమాలో రవితేజ నుంచి వస్తున్న సినిమా క్రాక్. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉంది యూనిట్. ఇటు ప్రేక్షకులు కూడా రవితేజ ఈసారి కొత్తగా ఏదైనా ట్రై చేసి ఉంటాడని అనుకున్నారు.

కానీ ఈరోజు రిలీజైన ట్రయిలర్ చూస్తే మరోసారి రవితేజ సెలక్షన్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తిగా మాస్ ఎలిమెంట్స్ పై ఆధారపడి క్రాక్ సినిమాను తెరకెక్కించారనే విషయం ఈరోజు ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. కథ, రవితేజ లుక్, క్యారెక్టర్.. ఇలా ఎందులో కొత్తదనం కనిపించలేదు. కేవలం ఇదొక రివెంజ్ డ్రామా అనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతుంది.

రవితేజ కావాలనే మరోసారి పాత మూస కథను ఎంచుకున్నాడా లేక మేకర్స్ కావాలనే ట్రయిలర్ ను ఇలా మాస్ ఎలిమెంట్స్ తో నింపేశారా అనే విషయం తేలాల్సి ఉంది. ట్రయిలర్ ను వెంకటేష్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ చేయడం మాత్రం బాగుంది.

అన్నట్టు ఈ సినిమా విడుదలను ముందుకు తీసుకొచ్చారు. 14వ తేదీన రిలీజ్ కావాల్సిన క్రాక్ మూవీని జనవరి 9కే విడుదల చేయబోతున్నారు.

First Published:  1 Jan 2021 6:39 AM GMT
Next Story