Telugu Global
Cinema & Entertainment

'సోలో'గా ఉండకుండా ఇదేం ప్లానింగ్ గురూ!

సోలో బ్రతుకే సో బెటర్.. టైటిల్ కు తగ్గట్టే ఈ సినిమాకు సోలో రిలీజ్ దొరికింది. కావాల్సినన్ని థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. మరో సినిమా పోటీలో లేకపోవడంతో.. పనిదినాలైన సోమ, మంగళ, బుధవారాలు కూడా ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. ఇలాంటి టైమ్ లో ఏ నిర్మాతైనా ఏం చేస్తాడు? సినిమాకు మరింత ప్రచారం కల్పిస్తాడు. రెండో వారాంతం కూడా మంచి వసూళ్లు కళ్లజూస్తాడు. కానీ […]

సోలోగా ఉండకుండా ఇదేం ప్లానింగ్ గురూ!
X

సోలో బ్రతుకే సో బెటర్.. టైటిల్ కు తగ్గట్టే ఈ సినిమాకు సోలో రిలీజ్ దొరికింది. కావాల్సినన్ని థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. మరో సినిమా పోటీలో లేకపోవడంతో.. పనిదినాలైన సోమ, మంగళ, బుధవారాలు కూడా ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి.

ఇలాంటి టైమ్ లో ఏ నిర్మాతైనా ఏం చేస్తాడు? సినిమాకు మరింత ప్రచారం కల్పిస్తాడు. రెండో వారాంతం కూడా మంచి వసూళ్లు కళ్లజూస్తాడు. కానీ సోలో బ్రతుకే సో బెటర్ విషయంలో మాత్రం ఇది రివర్స్ అయింది. సెకెండ్ వీకెండ్ దగ్గరపడుతున్న టైమ్ లో మేకర్స్ తీసుకున్న ఓ నిర్ణయం, ఈ సినిమా వసూళ్లపై పెద్ద ప్రభావం చూపించబోతోంది.

అవును.. రేపట్నుంచి ఈ సినిమాను జీ ప్లెక్స్ అనే యాప్ లో పెట్టేస్తున్నారు. 149 రూపాయలు చెల్లించి ఎంచక్కా ఎవరింట్లో వాళ్లు ఈ సినిమా చూసుకోవచ్చు. అంతేకాదు.. కొంత మొత్తం చెల్లించి డిష్ టీవీ, ఎయిర్ టెల్, టాటా స్కై లాంటి సెట్ టాప్ బాక్సుల్లో కూడా రేపట్నుంచి ఈ సినిమా చూసుకోవచ్చు.

అసలే వీకెండ్, దీనికి తోడు న్యూ ఇయర్ హంగామా ఉండనే ఉంది. థియేటర్లకు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు ఉన్న ఏకైక ఆప్షన్ ఈ సినిమా. ఇలాంటి టైమ్ లో తీసుకున్న ఈ నిర్ణయం వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించడం ఖాయం.

First Published:  31 Dec 2020 5:47 AM GMT
Next Story