Telugu Global
Cinema & Entertainment

సోలో కష్టాలు బయటపెట్టిన సాయితేజ్

ఓ సినిమా ఆగిపోతే నిర్మాతకు ఎంత నష్టమో అందరికీ తెలిసిందే. బడ్జెట్ చేతులు దాటిపోతుంది. వడ్డీలు పెరిగిపోతాయి. అదే సమయంలో హీరో-దర్శకుడికి కూడా టెన్షన్ ఉంటుంది. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఈ కష్టాలన్నీ చూసింది. ఇప్పుడు సక్సెస్ అయింది. ఈ సందర్భంగా సాయితేజ్ తన మనసులో మాట బయటపెట్టాడు. తన సినిమా పడిన కష్టాల్ని బయటపెట్టాడు. “మే సినిమా రిలీజ్‌ అనుకున్నప్పటికి రెండు పాటలు మిగిలిపోయాయి. అదే సమయంలో కోవిడ్‌ ప్రభావం స్టార్ట్‌ కావడంతో […]

sai tej
X

ఓ సినిమా ఆగిపోతే నిర్మాతకు ఎంత నష్టమో అందరికీ తెలిసిందే. బడ్జెట్ చేతులు దాటిపోతుంది. వడ్డీలు పెరిగిపోతాయి. అదే సమయంలో హీరో-దర్శకుడికి కూడా టెన్షన్ ఉంటుంది. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఈ కష్టాలన్నీ చూసింది. ఇప్పుడు సక్సెస్ అయింది. ఈ సందర్భంగా సాయితేజ్ తన మనసులో మాట బయటపెట్టాడు. తన సినిమా పడిన కష్టాల్ని బయటపెట్టాడు.

“మే సినిమా రిలీజ్‌ అనుకున్నప్పటికి రెండు పాటలు మిగిలిపోయాయి. అదే సమయంలో కోవిడ్‌ ప్రభావం స్టార్ట్‌ కావడంతో అందరూ అయోమయంగా తయారయ్యాం. అందరూ టీవీలు, ఓటీటీలకు అలవాటు పడిపోతారేమోనని భయపడ్డాం. అదే సమయంలో జీ స్టూడియో నుండి ఓ ఆఫర్‌ వచ్చింది. వాళ్లకి సినిమాను ఇవ్వాలా వద్దా అని అనుకున్నాం. అయితే చివరకు ప్రొడ్యూసర్‌గారికి లాభాలు కావాలనే ఉద్దేశంతో సినిమాను వారికి ఇచ్చేశాం.”

జీ స్టుడియోస్ కు సినిమాను ఇచ్చేసినా, థియేటర్లలో రాదేమో అనే భయం తనకు ఉండేదని.. ఫైనల్ గా థియేటర్లు తెరవడం.. జీ స్టుడియోస్ తో పాటు అంతా సహకరించడంతో థియేటర్లలోకి రావడం చాలా హ్యాపీగా ఉందంటున్నాడు సాయితేజ్. ఓ హీరోకు లేదా దర్శకుడికి తన పేరును బిగ్ స్క్రీన్ పై చూసుకోవడంలో వచ్చే ఆనందం ఇంకెందులోనూ ఉండదంటున్నాడు ఈ మెగా హీరో.

First Published:  29 Dec 2020 11:36 PM GMT
Next Story