బ్రిటన్ సూపర్ మార్కెట్స్‌లో జంక్ ఫుడ్ బ్యాన్!
ప్రపంచంలో సూపర్ మార్కెట్ ఎక్కడైనా… సూపర్ మార్కెటే! కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చాక.. బిల్లింగ్ కౌంటర్ దగ్గర సాఫ్ట్ డ్రింక్స్, కేక్స్, చిప్స్ వంటి రకరకాల హై షుగర్, హై ఫ్యాట్ ఉన్న జంక్ ఫుడ్‌కు సంబంధించి… ఒకటి కొంటె మరొకటి ఫ్రీ అంటూ ఆకర్షిస్తుంటాయి. అవి ఆరోగ్యానికి మంచిది కాదని దాదాపు అందరికీ తెలుసు. కానీ, దాని మీద ఉన్న ధర టెంప్ట్ చేస్తుంది. కొంటాం.. తింటాం అయిపోతుంది. నెమ్మదిగా బరువు పెరుగుతుంటాం. అది ఎక్కడో శరీరంలో […]

ప్రపంచంలో సూపర్ మార్కెట్ ఎక్కడైనా… సూపర్ మార్కెటే! కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చాక.. బిల్లింగ్ కౌంటర్ దగ్గర సాఫ్ట్ డ్రింక్స్, కేక్స్, చిప్స్ వంటి రకరకాల హై షుగర్, హై ఫ్యాట్ ఉన్న జంక్ ఫుడ్‌కు సంబంధించి… ఒకటి కొంటె మరొకటి ఫ్రీ అంటూ ఆకర్షిస్తుంటాయి. అవి ఆరోగ్యానికి మంచిది కాదని దాదాపు అందరికీ తెలుసు. కానీ, దాని మీద ఉన్న ధర టెంప్ట్ చేస్తుంది. కొంటాం.. తింటాం అయిపోతుంది. నెమ్మదిగా బరువు పెరుగుతుంటాం. అది ఎక్కడో శరీరంలో తిరగబెడుతూనే ఉంటుంది. అయినా పట్టించుకోకుండా మళ్లీ మళ్లీ కొంటాం… తింటాం. కారణం ఆఫర్లు తప్ప ఇంకోటి కాదు! ఈ ఆఫర్ల వల్ల… వాళ్ల సేల్స్ యాభై శాతం పెరుగుతాయని చాలామందికి తెలియదు. దాంతో కొన్నవాళ్ల జేబుతో పాటు శరీరం కూడా గుల్ల అవుతుంది.
‘ఇగో మీ సూపర్‌మార్కెట్స్.. జంక్ ఫుడ్ అంటే ఫ్యాట్, ఉప్పు ఎక్కువ ఉండే ఫుడ్స్,షుగర్ డ్రింక్స్( సాఫ్ట్ డ్రింక్స్) కేక్స్, రెడీ మీల్స్‌తో పాటు వాటికి సంబంధించిన ‘బయ్ వన్ గెట్ వన్ ఫ్రీ’ ‘వన్ ఫర్ థ్రీ’ ఆఫర్లు తొలగించాలి” అని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అంటే.. బ్రిటన్‌లో ఒబెసిటీతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఇలా ఇష్టమొచ్చినట్టు బరువు పెరగడానికి ప్రధాన కారణం.. జంక్ ఫుడ్డేనని తెలుసుకోగలిగారు. కేవలం సూపర్ మార్కెట్స్‌లోనే కాదు. స్టోర్స్‌లో కూడా ఇలాంటి ఆఫర్లు పెట్టకూడదని చెప్పింది. అంతేకాదు జంక్‌ఫుడ్, డ్రింక్స్ తాలూకు ఆఫర్ల లింక్‌లు, ప్రకటనలు వెబ్‌సైట్స్‌లో పెట్టకూడదని కూడా చెప్పింది. అయితే, ఈ నిషేధం 2022 ఏప్రిల్ నుంచి అమలు కానుంది.
అయితే, అప్పటిలోగా సూపర్ మార్కెట్స్ ఇప్పుడు ప్రకటించిన గైడ్‌లైన్స్ ఆధారంగా నడుచుకోవాలని సూచించింది. పోయిన సంత్సరం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ఒబెసిటీ సమస్యను ఎదుర్కొవడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. అయితే, సంవత్సరం నుంచి ఫుడ్ ఇండస్ట్రీలు.. లాబీయింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ, బ్రిటన్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాట మీద నిలబడి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని బ్రిటన్ ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతించారు.
బ్రిటన్‌లో దాదాపు 63 శాతం యూత్ ఒబెసిటీతో బాధపడుతున్నారు. స్కూల్‌లో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరికి ఒబెసిటీ ఉంది. సివియర్ ఒబెసిటీ ఉన్నవాళ్లు… కరోనా వైరస్‌తో చనిపోయే అవకాశాలు 90 శాతం ఎక్కువని తేలడం కూడా బ్రిటన్‌ని భయపెట్టింది.
ఆఫర్లతో ప్రజల పైసలు సేవ్ చేయడానికి బదులు.. ప్రజల ఆరోగ్యాన్ని సేవ్ చేయాలనే దృష్టితో సూపర్ మార్కెట్స్ ఆలోచించడం మంచిది. లేదంటే కనీసం.. ప్రజలే తమ ఆరోగ్యం గురించి ఆలోచించుకొని.. మనసులో జంక్‌ఫుడ్‌పై నిషేధం విధించుకోవాలి. ఇది కేవలం బ్రిటన్‌కో, భారతదేశానికో కాదు.. ప్రపంచం మొత్తానికీ వర్తిస్తుంది.