Telugu Global
International

కరోనా వ్యాక్సిన్... ఎప్పుడు? ఎలా? ఎవరికి?

కరోనా వ్యాక్సిన్ వస్తుందనే ఆశతో అందరూ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే కొన్ని దేశాల్లో వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. యూకెలో వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ కూడా మొదలైంది. 2021 ప్రారంభంలో మనదేశంలో కూడా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ మొదలవ్వొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ గురించి చాలామందికి చాలా సందేహాలున్నాయి. దాని ధర ఎంత ఉండొచ్చు? ఎవరెవరికి ఇస్తారు? దానికోసం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఇలా బోలెడు ప్రశ్నలు ఉండడం సహజం.. అందుకే వ్యాక్సిన్‌కు […]

కరోనా వ్యాక్సిన్... ఎప్పుడు? ఎలా? ఎవరికి?
X

కరోనా వ్యాక్సిన్ వస్తుందనే ఆశతో అందరూ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే కొన్ని దేశాల్లో వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. యూకెలో వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ కూడా మొదలైంది. 2021 ప్రారంభంలో మనదేశంలో కూడా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ మొదలవ్వొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ గురించి చాలామందికి చాలా సందేహాలున్నాయి.

దాని ధర ఎంత ఉండొచ్చు? ఎవరెవరికి ఇస్తారు? దానికోసం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? ఇలా బోలెడు ప్రశ్నలు ఉండడం సహజం.. అందుకే వ్యాక్సిన్‌కు సంబంధించి పూర్తి గైడ్ ఒకసారి చూద్దాం.

ప్రపంచ వ్యాప్తంగా ధరలు ఇలా…

ముందుగా వ్యాక్సిన్ ధర విషయానికొస్తే… ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా కంపెనీలు వ్యాక్సిన్‌ను రెడీ చేస్తున్నాయి. ఇందులో ఒక్కొక్క వ్యాక్సిన్ ధర ఒక్కోలా ఉండొచ్చు.

వ్యాక్సిన్ రేస్‌లో అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్ అన్నింటికంటే ముందుంది. ఇది 95శాతం పనిచేస్తుందని సంస్థ ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ ధర 37యూఎస్ డాలర్లు అంటే 2500 రూపాయలు ఉంటుంది.

యూకె ఆమోదించిన ఫైజర్ వ్యాక్సిన్‌ 60 నుంచి 80 శాతం వరకూ పనిచేస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ను రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. దీని ధర 20 నుంచి 40 డాలర్ల వరకూ ఉండొచ్చు.

ఇకపోతే మనదేశంలో తయారవుతున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ధర 220 రూపాయల వరకూ ఉండొచ్చని సంస్థ చెప్తుంది. దీన్ని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థలు కలిసి తయారు చేస్తున్నాయి. మనదేశంలో ఈ వ్యాక్సిన్‌ను ‘సీరం ఇనిస్టిట్యూట్’ తయారుచేస్తోంది.

వ్యాక్సిన్ రేసులో ఉన్న చైనా కూడా తమ సినోఫార్మ్ వ్యాక్సిన్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తోంది. అయితే దీని ధర 1000 చైనా యువాన్‌లు అంటే పది వేల రూపాయల వరకూ ఉండొచ్చు.

మనదేశం సొంతగా తయారు చేస్సున్న కోవ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌లో ఉంది. ‘భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్’ తయారుచేస్తున్న ఈ వ్యాక్సిన్ ధరను ఇంకా నిర్ణయించలేదు. అయితే ఈ వ్యాక్సిన్‌ను మన దేశంలో ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు కొన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. దేశీయ వ్యాక్సిన్ కాబట్టి ఎక్కువ ధర ఉండే అవకాశం లేదు.

రిజిస్ట్రేషన్ అవసరమా?

వ్యాక్సిన్‌ కావాలంటే ముందుగా పేరు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత టీకా ఎప్పుడు, ఎక్కడ వేసేది చెప్తారు. అయితే ముందుగా హెల్త్ వర్కర్స్‌కి, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి, ఇతర వ్యాధులు ఉన్నవారికి ఇస్తారు. అలాగే వయసు ఆధారంగా కూడా గ్రూపులుగా విభజించి, దాని ప్రకారం వ్యాక్సిన్ అందజేసే వీలుంది. ఆ తర్వాత మిగతా వాళ్లందరికీ అందజేసే అవకాశం ఉంది. అలా మొదటి స్టేజిలో 30 కోట్ల మందికి టీకాలు వేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

రిజిస్ట్రేషన్‌ ఎలా?

కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన వారిని, వ్యాక్సిన్ తీసుకున్న వారిని ట్రాక్ చేసేందుకు ‘కోవిడ్ వాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్’(కో-విన్) అనే వ్యవస్థను ఉపయోగించనున్నట్లు ప్రభుత్వం చెప్తోంది.

ఈ ‘కో-విన్’ వెబ్‌సైట్‌లోనే వ్యాక్సిన్ కావాల్సిన వాళ్లు పేరు నమోదు చేసుకోవాలి. దీనికోసం ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ లాంటి గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అవి లేకపోతే.. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్యేలు జారీచేసిన అధికారిక ఫొటో గుర్తింపుకార్డు, పాన్‌కార్డు, బ్యాంకు లేదా పోస్టాఫీసు పాస్‌బుక్‌లు, పెన్షన్‌ డాక్యుమెంటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఉద్యోగ గుర్తింపుకార్డులు ఇలా చాలారకాల గుర్తింపు కార్డులు చెల్లుబాటవుతాయి.

ఎలా వేస్తారు?

వ్యాక్సిన్ వేసేందుకు వ్యాక్సి్న్ స్టేషన్‌లను ఏర్పాటు చేసి ఐదారుగురు బృందం ఉండే టీమ్స్‌తో.. ప్రతి సెషన్లో వంద మందికి టీకాలు వేసేలా ప్లాన్ చేస్తు్న్నారు.

వ్యాక్సిన్ కావాలనుకున్న వారు స్వచ్ఛందంగానే తమపేర్లు నమోదు చేసుకోవాలని, కచ్చితంగా తీసుకోవాలన్న బలవంతం ఏమీ ఉండదని కూడా ప్రభుత్వం తెలిపింది. పేరు నమోదు చేసుకున్న తర్వాత వ్యాక్సిన్‌ ఎక్కడ, ఎప్పుడు ఇస్తారన్న సమాచారం ఫోన్‌కు వస్తుంది.

వైరస్‌ సోకిందా? లేదా? అన్నదానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. వైరస్ సోకి తగ్గిన వారు కూడా వ్యాక్సిన్ తీసుకుంటే ఎలాంటి రిస్క్ ఉండదు. అలాగే అప్పటికి వైరస్ సోకి ఉన్నవారికి మాత్రం లక్షణాలు తగ్గిపోయిన 14 రోజుల తర్వాత టీకా ఇస్తారు.

వ్యాక్సిన్‌ను 28 రోజుల తేడాతో రెండు డోసులు తీసుకోవాలి. రెండో డోస్‌ తీసుకున్న రెండు వారాలకు రోగ నిరోధశక్తి ఏర్పడుతుందని వ్యాక్సిన్ సంస్థలు చెప్తున్నాయి.

First Published:  28 Dec 2020 5:37 AM GMT
Next Story