Telugu Global
NEWS

హనుమంతన్న కోపానికి అసలు కారణం అదేనా..?

రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పీఠం దాదాపుగా ఖరారైన వేళ.. సీనియర్లంతా కాంగ్రెస్ ని వీడతారంటూ దింపుడు కళ్లెం ఆశలతో బెదిరిస్తున్నారు వి.హనుమంతరావు. కాంగ్రెస్ నే నమ్ముకుని ఉన్న సీనియర్లను కాదని, టీడీపీనుంచి వచ్చిన రేవంత్ కి ప్రయారిటీ ఇస్తున్నందుకు వి.హెచ్. ఆవేదనతో అలా అంటున్నారని అనుకున్నారంతా. కానీ అసలు కారణం అది కాదు. ఆ మూడు శాతం, ఆ మూడు శాతం అంటూ వీహెచ్ రాగాలు తీయడంతో ఆయన ఆక్రోశం ఇప్పుడు బైటపడింది. రాష్ట్రంలో కేవలం […]

హనుమంతన్న కోపానికి అసలు కారణం అదేనా..?
X

రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పీఠం దాదాపుగా ఖరారైన వేళ.. సీనియర్లంతా కాంగ్రెస్ ని వీడతారంటూ దింపుడు కళ్లెం ఆశలతో బెదిరిస్తున్నారు వి.హనుమంతరావు. కాంగ్రెస్ నే నమ్ముకుని ఉన్న సీనియర్లను కాదని, టీడీపీనుంచి వచ్చిన రేవంత్ కి ప్రయారిటీ ఇస్తున్నందుకు వి.హెచ్. ఆవేదనతో అలా అంటున్నారని అనుకున్నారంతా.

కానీ అసలు కారణం అది కాదు. ఆ మూడు శాతం, ఆ మూడు శాతం అంటూ వీహెచ్ రాగాలు తీయడంతో ఆయన ఆక్రోశం ఇప్పుడు బైటపడింది.

రాష్ట్రంలో కేవలం 3శాతం మాత్రమే ఉన్న రేవంత్ రెడ్డి సామాజిక వర్గం పార్టీని నాశనం చేసిందని, ఇప్పుడు కచ్చితంగా బీసీకే పీసీసీ పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బీసీల్లో అంతటి చరిష్మా ఉన్న నాయకులు లేరు అనుకుంటే పొరుగు రాష్ట్రంలో ఉన్న పవన్ కల్యాణ్ ని తెచ్చి అయినా పీసీసీ పీఠంపై కూర్చోబెట్టాలని, అంతే కాని ఆ మూడు శాతం మందిలో ఒకరికి ఆ పదవి ఇస్తే చూస్తూ ఊరుకోబోమని తాజాగా స్పష్టం చేశారు వీహెచ్.

వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా.. ఆయన విగ్రహావిష్కరణలో పాల్గొన్న వీహెచ్, కాపులను ఊరడించేందుకే పవన్ కల్యాణ్ పేరు తెరపైకి తెచ్చారని తెలుస్తోంది. జనసేన వదిలిపెట్టి పవన్ కాంగ్రెస్ లోకి ఎందుకొస్తారు, అందులోనూ తెలంగాణ రాజకీయాల్లో ఆయన వేలెందుకు పెడతారు. ఆమాత్రం తెలియక కాదు, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసేందుకే ఆయన కాపుల్ని రెచ్చగొట్టేలా పవన్ పేరు వాడుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తరతరాలుగా ఒకే కుటుంబం చేతిలో ఉండిపోవచ్చు కానీ, తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్ష పదవి మాత్రం అర్హతను బట్టి కాకుండా, కులాన్ని బట్టి ఇవ్వాలా..? ఇదెక్కడి లాజిక్.

అధికారంలేని తెలంగాణలో పీసీసీ పదవి ఎవరికైనా ముళ్ల కిరీటం లాంటిదే. దాన్ని వదిలించుకోవాలని చూసేవారే కానీ, కావాలని అడిగేవారు అరుదు. అలాంటిది.. పార్టీని ఒకే తాటిపైకి తేవాలని రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని ఎవరూ కాదనలేరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవి కావాలని గట్టిగా పట్టుబడుతున్నా.. నల్గొండ, పరిసర ప్రాంతాల్లో మినహా.. ఉత్తర తెలంగాణలో ఆయనకు పలుకుబడి లేదు. ప్రస్తుతానికి రేవంత్ మినహా.. రాష్ట్రవ్యాప్తంగా అంతటి చరిష్మా ఉన్న నాయకుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకెవ్వరూ కనిపించకపోవడంతో అధిష్టానం ఆయనవైపు మొగ్గు చూపినట్టు వార్తలొస్తున్నాయి.

వీహెచ్ మాత్రం రేవంత్ కి ఆ పదవి దక్కకూడదని చివరి వరకూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ ఈ సీనియర్ నేత ప్రతిపాదించిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేత కదా. అప్పుడెందుకు వీహెచ్ కి ఆ 3శాతం గుర్తు రాలేదు, రంగా విగ్రహాన్ని చూడగానే పవన్ కల్యాణ్ ఎందుకు గుర్తొచ్చినట్టు? అనే ప్రశ్నలూ వినపడుతున్నాయి.

మొత్తమ్మీద రేవంత్ రెడ్డిపై వీహెచ్ కి ఉన్న కోపానికి అసలు కారణం మాత్రం ఇలా బైటపడిందని అంటున్నారు.

First Published:  26 Dec 2020 9:20 PM GMT
Next Story