అందుకే ఈ హీరోకు ఫ్లాపులు వచ్చాయి
ఆది సాయికుమార్.. టాలీవుడ్ లో ఓ రేంజ్ కు ఎదగాల్సిన హీరో. అన్నీ ఉన్నా అదృష్టం కలిసిరాలేదు. అంతకంటే ముందు స్టోరీ సెలక్షన్ లో ఈ హీరో వీక్. తన తప్పుల్ని తాను తెలుసుకున్నాడు ఈ నటుడు. హీరోగా ఎదిగే కంటే నటుడిగా నిరూపించుకోవడం ముఖ్యం అంటున్నాడు. “ముందు కమర్షియల్ అనుకున్నాను. అవి వర్కవుట్ అవ్వకపోవడంతో కాన్సెప్ట్ మూవీస్ చేస్తున్నాను. అందులో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను. అందుకే ఫ్లాప్స్ వచ్చాయి. ఈసారి ప్రాపర్ కాన్సెప్ట్ […]

ఆది సాయికుమార్.. టాలీవుడ్ లో ఓ రేంజ్ కు ఎదగాల్సిన హీరో. అన్నీ ఉన్నా అదృష్టం కలిసిరాలేదు. అంతకంటే ముందు స్టోరీ సెలక్షన్ లో ఈ హీరో వీక్. తన తప్పుల్ని తాను తెలుసుకున్నాడు ఈ నటుడు. హీరోగా ఎదిగే కంటే నటుడిగా నిరూపించుకోవడం ముఖ్యం అంటున్నాడు.
“ముందు కమర్షియల్ అనుకున్నాను. అవి వర్కవుట్ అవ్వకపోవడంతో కాన్సెప్ట్ మూవీస్ చేస్తున్నాను. అందులో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను. అందుకే ఫ్లాప్స్ వచ్చాయి. ఈసారి ప్రాపర్ కాన్సెప్ట్ మూవీస్ చేస్తున్నాను. ఉదాహరణకు బ్లాక్ అనే సినిమా చూసుకుంటే అది థ్రిల్లర్. ఎలాంటి డీవియేషన్స్ ఉండవు. ఇలా పూర్తిగా కంటెంట్ ను నమ్మి చేస్తున్నాను. కాన్సెప్ట్ లో మళ్లీ అవసరం లేకుండా పాటలు, ఫైట్లు పెట్టడం లేదు.”
ఇలా కెరీర్ పరంగా ట్రాక్ మార్చిన విషయాన్ని వెల్లడించాడు ఆది సాయికుమార్. ఈసారి ఏ సినిమా అంగీకరించినా కథ-కథనం చూసి ఓకే చెబుతానంటున్నాడు. బ్లాక్ సినిమాతో పాటు శశి, జంగిల్ అనే మరో 2 సినిమాల్ని కూడా రిలీజ్ కు రెడీ చేశాడు ఈ హీరో. ఇవన్నీ వరుసగా కొత్త సంవత్సరంలో రిలీజ్ అవుతాయంటున్నాడు.