Telugu Global
International

2021లో గట్టిగా అనుకోండి...

కొత్త సంత్సరం రాబోతుందంటేనే.. అందర్లో ఓ కొత్త ఉత్సాహం మొదలవుతుంది. న్యూ ఇయర్‌‌ని ఫ్రెష్‌గా స్టా్ర్ట్ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోయేముందు ఈ సంవత్సరం నుంచి ఇవి మానేయాలి, ఇవి స్టార్ట్ చేయాలి అంటూ బోలెడు ప్లాన్స్ ఉంటాయి. వాటిని కొందరు సీరియస్‌గా తీసుకుంటే… మరికొందరు మాత్రం ఏదో మొక్కుబడిగా ఫస్ట్ లో కొన్ని రోజులు ఫాలో అయ్యి, తర్వాత వల్ల కాక వదిలేస్తారు. కొత్త సంవత్సరం అనగానే చాలామందికి […]

2021లో గట్టిగా అనుకోండి...
X

కొత్త సంత్సరం రాబోతుందంటేనే.. అందర్లో ఓ కొత్త ఉత్సాహం మొదలవుతుంది. న్యూ ఇయర్‌‌ని ఫ్రెష్‌గా స్టా్ర్ట్ చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోయేముందు ఈ సంవత్సరం నుంచి ఇవి మానేయాలి, ఇవి స్టార్ట్ చేయాలి అంటూ బోలెడు ప్లాన్స్ ఉంటాయి. వాటిని కొందరు సీరియస్‌గా తీసుకుంటే… మరికొందరు మాత్రం ఏదో మొక్కుబడిగా ఫస్ట్ లో కొన్ని రోజులు ఫాలో అయ్యి, తర్వాత వల్ల కాక వదిలేస్తారు. కొత్త సంవత్సరం అనగానే చాలామందికి వచ్చే కామన్ రిజల్యూషన్స్ ఇవే..

కొత్త సంవత్సరం అనగానే చాలామంది కామన్‌గా పెట్టుకునే రిజల్యూషన్స్.. మందు, సిగరెట్లు మానేయాలనుకోవడం, పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఉద్యోగం సంపాదించుకోవడం, టూర్‌ ప్లాన్స్, సెల్‌ఫోన్‌లో గడిపే సమయాన్ని తగ్గించడం, డబ్బు పొదుపు చేయడం, వ్యాయామం చేయడం. ఇలాంటి రిజల్యూషన్స్‌నే చాలామంది పెట్టుకుంటారు. అయితే వీటని ఫాలో అవ్వాలంటే ఎంతో డెడికేషన్ అవసరం. నెల నుంచి రెండు నెలలపాటు గట్టిగా ట్రై చేస్తే వీటిని పాటించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇకపోతే వీటితో పాటు కొన్ని చిన్నచిన్న పనులు చేయడం ద్వారా కూడా కొత్త సంవత్సరాన్ని ఇయర్‌‌ను మరింత కొత్తగా మార్చుకోవచ్చు. అవేంటంటే..

పుస్తకంతో కాసేపు..

కొత్త సంవత్సరంలో కొత్తగా అప్‌డేట్ అవ్వాలంటే.. బుక్స్ చదివే అలవాటుని అలవర్చుకోవాలి. దీంతో న్యూ ఇయర్‌‌ను కొత్త ఆలోచనలతో మొదలుపెట్టొచ్చు. అలాగే షెల్ఫ్‌లో ఉన్న పుస్తకాలను ఒకసారి రీ చెక్ చేసి, పనికొచ్చేవి ఉంచి, అవసరంలేనివి ఎవరికైనా ఇచ్చేయొచ్చు.

క్లీన్ యువర్ జంక్

న్యూ ఇయర్ లో ఇంటితో పాటు క్లీన్ చేయాల్సింది మరోటుంది. అదే డిజిటల్ క్లీనింగ్. కాస్త వీలు కుదుర్చుకుని మన మొబైల్ ఇంకా ల్యాప్‌టాప్‌లో అనవసరంగా ఉన్న ఫైల్స్, జంక్ మెయిల్స్, గూగుల్ డ్రైవ్ ఇలా డిజిటల్ చెత్తనంతా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే పాత సంవత్సరంతో పాటే కొన్ని పాత యాప్స్‌కు కూడా గుడ్ బై చెప్పేయడం బెటర్. ఎప్పటినుంచో వాడకుండా ఉన్న యాప్స్‌ ఇంకా.. టైం తినేసే సోషల్ మీడియా, గేమింగ్ యాప్స్‌ను కూడా డిలీట్ చేయడం బెటర్. దీనివల్ల అనవసరమైన గందరగోళాలు తగ్గి, మనసు ప్రశాంతంగా మారుతుంది.

వంటిల్లు శుభ్రంగా…

ఇంట్లో అన్నిగదుల కంటే వంట గది శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అందులో ఈ కరోనా టైంలో ఇది మరింత ముఖ్యం. అందుకే న్యూ ఇయర్‌‌కి ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అలాగే.. ఇకనుంచి ప్రతీరోజు కిచెన్‌ను క్లీన్‌గా ఉంచాలన్న రిజల్యూషన్ కూడా పెట్టుకోవాలి. కిచెన్ శుభ్రంగా ఉంటే చాలావరకూ హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే కొత్తకొత్త వంటలు ట్రై చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది.

అప్పులొద్దు

న్యూ ఇయర్‌‌లో చేయాల్సిన మరో ముఖ్యమైన పని అప్పులు తీర్చేయడం. ఏవైనా చిన్న చిన్న అప్పులు లాంటివి ఉంటే వాటిని వీలైనంత త్వరగా తీర్చేయాలని నిర్ణయించుకోండి. అలాగే కొత్త సంవత్సరంలో కొత్త అప్పులు చేయకూడదని కూడా గట్టిగా నిర్ణయించుకోవాలి. దాంతో పాటు కొత్త సంవత్సరం నుంచి బడ్జెట్ వేసుకొని ప్లాన్ ప్రకారం ఖర్చు చేసేలా ఒక బడ్జెట్ రెడీ చేసుకోవాలి. దాంతోపాటే సేవింగ్స్, ఇన్వెస్ట్ మెంట్స్ కోసం కూడా కొంత కేటాయించేలా ప్లాన్ చేసుకోవాలి.

ఫిట్‌గా..

ఇకపోతే అన్నింటికంటే ముఖ్యంగా.. న్యూ ఇయర్‌‌కి బరువు తగ్గాలనో, ఫిట్‌గా ఉండాలనో.. ఇలా ఏదో ఒక హెల్త్ పరమైన రిజల్యూషన్ కచ్చితంగా పెట్టుకోవాలి. న్యూ ఇయర్‌‌లో మరింత హెల్దీగా ఉండాలని గట్టి్గా అనుకోవాలి.

రిజల్యూషన్ అంటే మనల్ని మనం మెరుగుపరుచుకోవడం కోసం పెట్టుకునేది. అది ఆరోగ్యపరంగా లేదా పనిలో సమర్థత ఇలా ఏదైనా కావొచ్చు. అయితే ఆచరణలో సాధ్యమయ్యే వాటినే లక్ష్యాలుగా పెట్టుకోవాలి. మీలో మీకు కావాల్సిన మార్పును తెచ్చుకోవాలంటే ఇదొక బెస్ట్ ఆప్షన్.

First Published:  27 Dec 2020 2:16 AM GMT
Next Story