Telugu Global
International

2021లో ఇవన్నీ కాస్ట్లీ

కరోనా దెబ్బకి బిజినెస్, ఫైనాన్స్ రంగాలన్నీ తారుమారైపోయాయి. దీంతో కరోనా తర్వాత చాలా బిజినెస్‌ల్లో మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని వస్తువుల రేట్లు పెరగబోతున్నాయని నిపుణుల అంచనా. ఇంతకీ అవేంటంటే.. ఎలక్ట్రానిక్స్ కరోనా టైంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం బాగా పెరిగింది. నిన్నమొన్నటివరకూ చదవుకోవడం నుంచి వంట చేయడం వరకూ అన్నింటికీ ఆన్‌లైన్ మీదే ఆధారపడుతున్నారు. దాంతో మొబైల్స్, ల్యాప్ టాప్స్, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇప్పటికే ఎలక్ట్రానికి డివైజ్‌ల ధరలు […]

2021లో ఇవన్నీ కాస్ట్లీ
X

కరోనా దెబ్బకి బిజినెస్, ఫైనాన్స్ రంగాలన్నీ తారుమారైపోయాయి. దీంతో కరోనా తర్వాత చాలా బిజినెస్‌ల్లో మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని వస్తువుల రేట్లు పెరగబోతున్నాయని నిపుణుల అంచనా. ఇంతకీ అవేంటంటే..

ఎలక్ట్రానిక్స్

కరోనా టైంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం బాగా పెరిగింది. నిన్నమొన్నటివరకూ చదవుకోవడం నుంచి వంట చేయడం వరకూ అన్నింటికీ ఆన్‌లైన్ మీదే ఆధారపడుతున్నారు. దాంతో మొబైల్స్, ల్యాప్ టాప్స్, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇప్పటికే ఎలక్ట్రానికి డివైజ్‌ల ధరలు పెరిగాయి. 2021లో ఇంకా పెరిగే అవకాశముందట.

ఎంటర్‌‌టైన్‌మెంట్

కరోనాతో అవుట్‌డోర్ ఎంటర్‌‌టైన్‌మెంట్‌కు పూర్తిగా ఫుల్‌స్టాప్ పడింది. ఈవెంట్స్‌, థియేటర్స్ లాంటివి పూర్తిగా తగ్గిపోయాయి. అందుకే 2021లో ఇలాంటి అవుట్‌డోర్ ఈవెంట్స్‌కు, ఎంటర్‌‌టైన్‌మెంట్‌కు విపరీతమైన డిమాండ్ ఉండబోతుందంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌.కాన్సెర్ట్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్స్, వెడ్డింగ్ ఈవెంట్స్, ధియేటర్ షోస్ కు టికెట్ ధరలు పెరిగిపోయే అవకాశం ఉంది.

ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్

2021లో బాగా డిమాండ్ ఉండబోయే మరో ఇండస్ట్రీ ఫిట్‌నెస్. కరోనాతో ఫిట్ నెస్ ప్రాక్టీస్‌లన్నీ ఇంటి నుంచే జరుగుతున్నాయి. అందరూ ఇంటినుంచే వ్యాయామాలు చేస్తున్నారు. ఇప్పటికే హోమ్ వర్కవుట్స్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఇంట్లో నుంచి వ్యాయామాలు చేయాలంటే.. ఇంట్లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్ ఉండాల్సిందే. లాక్ డౌన్ టైంలోనే ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అలాగే 2021లో వీటి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.

బ్యూటీ ప్రొడక్ట్స్

కరోనాతో అన్నిరంగాలు దెబ్బతింటే బ్యూటీ ఇండస్ట్రీలు మాత్రం సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. అందుకే వీటి డిమాండ్ 2021లో కూడా ఎక్కువగానే ఉండబోతోందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు చాలా ఫార్మా ఇండస్ట్రీలు మెడిసిన్స్ తయారీకి ప్రిఫరెన్స్ ఇస్తుండడంతో బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీ తగ్గింది. దీంతో వీటికి 2021లో ఫుల్‌గా డిమాండ్ ఉండబోతోంది.

ఫర్నిచర్

చాలామంది ఉద్యోగులు ఇప్పుడు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ 2021లో కూడా కంటిన్యూ కాబోతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు వచ్చే సంవత్సరం మిడిల్ వరకూ వర్క ఫ్రమ్ హోమ్‌ను పొడిగించాయి. దీంతో ఫ్యూచర్‌‌లో ఫర్నిచర్‌‌కు ఫుల్ డిమాండ్ ఉండబోతోంది. ఇంటి నుంచి పనిచేయడం కోసం అందరూ ఇంట్లోనే ప్రత్యేకంగా ఆఫీస్ సెటప్ ఏర్పాటు చేసుకుంటున్నారు. సో.. నెక్స్ట్ ఇయర్ ఫర్నిచర్ కూడా కాస్ట్లీగా ఉండబోతుందన్నమాట.

First Published:  27 Dec 2020 2:12 AM GMT
Next Story