Telugu Global
NEWS

మీరు చేయరు... మమ్మల్ని చేేయనివ్వరు... ప్రతిపక్షాలపై ఎమ్మెల్సీ డొక్కా ధ్వజం...

పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తుంటే ప్రతిపక్షాలకు కుళ్లుగా ఉందని మండిపడ్డారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే 31లక్షలమంది పేదలకు ఇళ్ల ప్టటాలు అందించడం ఎప్పుడూ జరగలేదని, కేవలం జగన్ హయాంలోనే అది సాధ్యమైందని అన్నారు. చరిత్ర ఎరుగని విధంగా పేదలకు ఇళ్ల స్థలాలు అందిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తుంటే.. అభినందించాల్సిన ప్రతిపక్షాలు విమర్శలు చేయడం, కోర్టు కేసులతో ఆ బృహత్తర కార్యక్రమాన్ని […]

మీరు చేయరు... మమ్మల్ని చేేయనివ్వరు... ప్రతిపక్షాలపై ఎమ్మెల్సీ డొక్కా ధ్వజం...
X

పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తుంటే ప్రతిపక్షాలకు కుళ్లుగా ఉందని మండిపడ్డారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే 31లక్షలమంది పేదలకు ఇళ్ల ప్టటాలు అందించడం ఎప్పుడూ జరగలేదని, కేవలం జగన్ హయాంలోనే అది సాధ్యమైందని అన్నారు. చరిత్ర ఎరుగని విధంగా పేదలకు ఇళ్ల స్థలాలు అందిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తుంటే.. అభినందించాల్సిన ప్రతిపక్షాలు విమర్శలు చేయడం, కోర్టు కేసులతో ఆ బృహత్తర కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూడటం దారుణం అని అన్నారాయన.

ప్రతిపక్షాలు ఎప్పుడూ ఇలాంటి మంచి పనికోసం కనీసం ఆలోచన కూడా చేయలేదని, పేదలకు మేలు జరుగుతుందనే కడుపుమంట ఓ వైపు, మేలు చేసిన క్రెడిట్ జగన్ ఖాతాలోకి వెళ్తుందనే భయం మరోవైపు ప్రతిపక్షాలను పట్టి పీడిస్తున్నాయని విమర్శించారు. పేదల అభ్యున్నతికోసం పోరాటాలు చేస్తున్నామనే వామపక్షాలు సైతం టీడీపీకి వంతపాడటం విడ్డూరం అని అన్నారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్.

సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా…

వ్యవసాయం తర్వాత ఎక్కువమందికి ఉపాధి ఇస్తున్నది గృహనిర్మాణ రంగమేనని, సీఎం జగన్ ముందు చూపుతో పేదల ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టి రాష్ట్ర ఆర్థిక ఉన్నతికి తోడ్పాటునందిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం పూర్తయితే జీడీపీ 3 శాతం పెరుగుతుందని, పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలే ఇంత లోతుగా ఆలోచించలేరని, అలాంటిది జగన్, సంక్షేమంతోపాటు, అభివృద్ధికి బాటలు వేశారని ప్రశంసించారు. 30 రకాల వృత్తుల వారికి ఉపాధి దొరకడమే కాకుండా.. తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లకు అవసరమైన మెటీరియల్‌ అమ్మకాలతో రాష్ట్రంలో క్రయ విక్రయాలు పెరుగుతాయని, పరోక్షంగా చాలామందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు.

కోర్టు కేసులతో సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకుంటారా..?

అమరావతిలో 54వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే డెమోగ్రాఫిక్‌ ఇం బ్యాలెన్స్ వస్తుందని, అప్పుడు ఎలైట్ సెక్షన్‌ దెబ్బతింటుందని హైకోర్టులో టీడీపీ తరపున వాదనలు చేశారని, ఉన్నత వర్గాలు ఉండే ప్రాంతాల్లో పేదలకు స్థానం లేదా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేక, రాచరికంలో ఉన్నామో ప్రతిపక్షాలు ఆలోచించుకోవాలని హితవు పలికారు. పేదల పక్షాన మాట్లాడే చిత్తశుద్ధి ఉంటే తక్షణం కోర్టులో ఉన్న కేసులు ఉపసంహరించుకొని, అన్ని ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి మార్గం సుగమం చేయాలని ప్రతిపక్షాలకు సూచించారు.

సొంత ఇల్లు ఉంటే పేదవారికి ఆత్మస్థైర్యం వస్తుందని, తద్వారా జీవితంలో మార్పు వస్తుందని అన్నారు డొక్కా. ఇంతకాలం ఇంటి స్థలంకోసం, ఇళ్ల నిర్మాణం కోసమే పేదలు రోడ్లపైకి వస్తున్నారని, ఇకపై అలాంటి అవసరం ఉండదని అన్నారు. పేదలగురించి ఆలోచించడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సీఎం జగన్ ఆదర్శంగా తీసుకున్నారని అన్నారు. ఇకనైనా ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకుని, సంక్షేమ కార్యక్రమాలకు అడ్డు తగలడం మానుకోవాలని హితవు పలికారు.

First Published:  26 Dec 2020 11:18 AM GMT
Next Story