Telugu Global
International

కరోనా వచ్చి ఏడాది అయింది... ఏ నెలలో ఏం జరిగింది...

కోవిడ్ మనదేశానికి వచ్చి ఏడాదైంది. 2020కి అలా వెల్‌కమ్ చెప్పామో లేదా కరోనా, లాక్‌డౌన్ అన్ని గబాగబా జరిగిపోయి తీరా చూసేసరికి 2021 రానే వచ్చింది. కళ్లుమూసి తెరిచేలోగా గడిచిపోయిన 2020 కరోనా ఇయర్‌‌ని ఓసారి రివ్యూలా చూసేద్దామా.. 2019 డిసెంబర్‌‌లో కరోనా వైరస్ అవుట్ బ్రేక్ మొదలైంది. మొదట్లో మామూలుగా మొదలైన వైరస్ చూస్తుండగానే తన ప్రతాపం చూపించి 2020 మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంది. ఈ కరోనా ఇయర్ క్యాలెండర్‌‌ను నాలుగు ముక్కల్లో చెప్పాలంటే.. […]

కరోనా వచ్చి ఏడాది అయింది... ఏ నెలలో ఏం జరిగింది...
X

కోవిడ్ మనదేశానికి వచ్చి ఏడాదైంది. 2020కి అలా వెల్‌కమ్ చెప్పామో లేదా కరోనా, లాక్‌డౌన్ అన్ని గబాగబా జరిగిపోయి తీరా చూసేసరికి 2021 రానే వచ్చింది. కళ్లుమూసి తెరిచేలోగా గడిచిపోయిన 2020 కరోనా ఇయర్‌‌ని ఓసారి రివ్యూలా చూసేద్దామా..

2019 డిసెంబర్‌‌లో కరోనా వైరస్ అవుట్ బ్రేక్ మొదలైంది. మొదట్లో మామూలుగా మొదలైన వైరస్ చూస్తుండగానే తన ప్రతాపం చూపించి 2020 మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంది. ఈ కరోనా ఇయర్ క్యాలెండర్‌‌ను నాలుగు ముక్కల్లో చెప్పాలంటే.. జనవరి, ఫిబ్రవరీ, లాక్‌డౌన్, అన్‌లాక్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం గడిచిన విధానాన్ని ఒకసారి రీవిజిట్ చేస్తే..

జనవరి

ప్రపంచమంతా వైరస్ గురించి అప్పుడప్పుడే భయపడుతున్న రోజులవి. రాకూడదు అంటూ భయభయంగా చూస్తున్న టైంలో 2020 జనవరి 30న ఆ మహమ్మారి ఇండియాకు రానే వచ్చింది. జనవరి 30న కేరళలో తొలికేసు నమోదైంది. అప్పటి నుంచి మనదేశంలో కూడా భయం మొదలైంది.

మార్చి

మార్చి వచ్చేసరికి డబ్ల్యూహెచ్‌వో దీన్ని ప్యాండెమిక్‌గా డిక్లేర్ చేసింది. మార్చిలోనే ఢిల్లీలో కూడా మొదటి కేసు నమోదైంది. అప్పటికే మెల్లమెల్లగా ఒకట్రెండు మరణాలు కూడా సంభవించాయి. మార్చి 20న ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌ను నిలిపివేసింది. మార్చి 22న ప్రధాని జనతా కర్ఫ్యూ విధించారు. మార్చి 25 నుంచి లాక్‌డౌన్ మొదలైంది. అలా మార్చినెల ముగిసే సరికి ఇండియాలో కరోనా కేసుల సంఖ్య వెయ్యికి రీచ్ అయింది. వలస కూలీలు, విద్యార్ధులు తమ ఇళ్లకు చేరుకోడానికి నానా అవస్థలు పడ్డ రోజులు కూడా ఇవే…

ఏప్రిల్

ఏప్రిల్ అంటే.. దేశమంతా లాక్‌డౌన్ 2.0 నడిచిన రోజులు. కేవలం కూరగాయలు, మెడిసిన్స్ కోసం మాత్రమే బయటకు రాగలిగే పరిస్థితి. జనమంతా భయం గుప్పిట్లో ఇంటికే పరిమిత నెల ఇది. ఏప్రిల్ నెల మధ్యకే కేసులు పది వేలు దాటాయి. కరోనా టెస్టులు చేసే సదుపాయాలు ఇంప్రూవ్ అయ్యి, మొబైల్ వ్యాన్స్ పుట్టుకురావడం, జనాల్లో జాగ్రత్తలు పెరిగి అలవాట్లు మార్చుకోవడం మొదలైంది ఈ నెలలోనే.

మే

ఇది లాక్‌డౌన్ 3 పీరియడ్. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించింది. జోన్ వైజ్‌గా డివైడ్ చేసి హాట్‌స్పాట్స్, రెడ్ జోన్స్ ఏర్పాటు చేశారు. అప్పుడే కొన్ని గ్రీన్ జోన్ ఏరియాస్‌కు కాస్త రిలీఫ్ దొరికింది. కానీ అప్పటికీ కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే పోయాయి. కేసుల సంఖ్య పదివేలు దాటిన మూడు వారాల్లోనే 50 వేల మార్క్ కూడా రీచ్ అయింది. అలా కొనసాగుతుండగా లాక్‌డౌన్ నెలాఖరు వరకూ పొడిగించి వరల్డ్స్ లాంగెస్ట్ లాక్‌డౌన్ పీరియడ్ అమలు చేసిన దేశంగా ఇండియా నిలిచింది.

జూన్

ఇది అన్‌లాక్ 1.0 నడిచిన నెల. జనాల ఇబ్బందులకు కొంత రిలీఫ్ దొరికినా.. కేసుల సంఖ్య మాత్రం అమాంతం పెరిగిపోయింది. దాదాపు ఐదు లక్షల కేసులు, రెండు వేల మరణాలు నమోదయ్యాయి జూన్ నెల నాటికి.

జులై

ఇది అన్‌లాక్ 2.0 నడిచిన నెల. ఈ నెలాఖరికి ఏకంగా ఒక మిలియన్ కేసులు నమోదయ్యాయి. కోవాక్సిన్, జైకోవ్–D లాంటి వ్యాక్సిన్ ల తయారీ మొదలైంది కూడా ఈ నెలలోనే.

ఆగస్ట్

అత్యధిక కేసులు నమోదైన నెల ఇది. ఈ నెల చివరికల్లా.. దాదాపు మూడు మిలియన్ల కేసులు నమోదయ్యాయి. రాపిడ్ టెస్టింగ్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. అప్పటికి అన్‌లాక్ 3.0 నడుస్తుంది.

సెప్టెంబర్

కోవిడ్ ప్యాండెమిక్‌లోనే అత్యంత బాధాకరమైన నెల ఇది. ఈ నెలలో కేసుల సంఖ్య 41 శాతం, మరణాల రేటు 34శాతానికి పెరిగింది. అయితే ప్రభుత్వం నుంచి రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ పూర్తిగా తగ్గుతూ వచ్చాయి.

అక్టోబర్

ఒక చిన్న ఆశ చిగురించిన నెల ఇది. ఈ నెలలో కేసులు పెరిగే రేటు కాస్త తగ్గి, రికవరీ రేటు పెరిగింది. ఆగస్ట్‌లో 20 లక్షలు, సెప్టెంబర్‌‌లో 26 లక్షల కేసులు నమోదు కాగా అక్టోబర్‌‌లో కేసుల సంఖ్య 18 లక్షలకు తగ్గింది. జనం ఎవరిపనులు వాళ్లు తిరిగి చేసుకోవడం మొదలుపెట్టారు. ఉద్యోగులు కూడా తిరిగి ఆఫీసులకు వెళ్లే ప్రయత్నాలు మొదలయ్యాయి.

నవంబర్

ఎలాంటి రూల్స్, రిస్ట్రిక్షన్స్ లేని నెల ఇది. చలికాలం మొదలైంది, కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని అనుకుంటే.. నవంబర్ నాటికి కేసుల సంఖ్య బాగా తగ్గి, రికవరీ రేటు మరింత పెరిగింది. కేసుల సంఖ్య 32శాతం తగ్గింది. జనానికి పూర్తి రిలీఫ్ దొరికింది. కొద్దికొద్దిగా సేఫ్టీ మెజర్స్‌ను నెగ్లెక్ట్ చేయడం మొదలైంది.

డిసెంబర్

అలా 2020లో మొదట్లో మెల్లగా మొదలైన కోవిడ్ సినిమా.. మధ్యలో ఇంటర్వెల్ నాటికి పీక్స్‌కు చేరుకుని ఊపిరి ఆడనంత పని చేసింది. అలా మెల్లగా పేస్ తగ్గిస్తూ వచ్చి.. తీరా అయిపోయింది అనుకునే టైంకి క్లైమాక్స్‌లో మరొక ట్విస్ట్ ఇచ్చింది. అప్పుడే అవ్వలేదు అంటూ కరోనా కొత్త స్ట్రెయిన్ పుట్టుకొచ్చి మళ్లీ ఇంకో కొత్త భయాన్ని స్టార్ట్ చేసింది. ఇలా 2020ని ఒక మ్యాజిక్ లా తన చుట్టూ తిప్పేసుకున్న కరోనా 2021లో ఏం చేస్తుందో చూడాలి.

Next Story