క్రిస్మస్ ఆచారాల వెనకున్న కథలివే...
క్రిస్మస్ అంటే వరల్డ్ వైడ్‌గా పెద్ద ఫెస్టివల్. ఈ రోజు ప్రపంచంలో చాలాదేశాలు క్రిస్మస్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. అన్ని పండుగల్లాగానే క్రిస్మస్ కు కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. కానీ అవి ఎలా పుట్టుకొచ్చాయో చాలామందికి తెలీదు. క్రిస్మస్ స్పెషల్‌గా ఈ రోజు వాటిగురించి తెలుసుకుందాం. ప్రపంచంలోని వివిధ దేశాల్లో వివిధ క్రిస్మస్ ఆచారాలు ఉన్నాయి. అందులో కొన్ని ఎప్పటి నుంచో వస్తూ ఉండగా మరికొన్ని కొత్తగా పుట్టుకొచ్చాయి. శాంతాక్లాజ్ గిఫ్ట్స్ క్రిస్మస్‌కి బహుమతులు ఇచ్చే […]

క్రిస్మస్ అంటే వరల్డ్ వైడ్‌గా పెద్ద ఫెస్టివల్. ఈ రోజు ప్రపంచంలో చాలాదేశాలు క్రిస్మస్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. అన్ని పండుగల్లాగానే క్రిస్మస్ కు కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. కానీ అవి ఎలా పుట్టుకొచ్చాయో చాలామందికి తెలీదు. క్రిస్మస్ స్పెషల్‌గా ఈ రోజు వాటిగురించి తెలుసుకుందాం.
ప్రపంచంలోని వివిధ దేశాల్లో వివిధ క్రిస్మస్ ఆచారాలు ఉన్నాయి. అందులో కొన్ని ఎప్పటి నుంచో వస్తూ ఉండగా మరికొన్ని కొత్తగా పుట్టుకొచ్చాయి.
శాంతాక్లాజ్ గిఫ్ట్స్
క్రిస్మస్‌కి బహుమతులు ఇచ్చే క్రిస్మస్ తాత అందరికీ సుపరిచితమే. కానీ అసలు ఆయన ఎవరు అనేది చాలామందికి తెలియదు. క్రిస్మస్ తాత అనే గెటప్ సెయింట్ నికోలస్ అనే వ్యక్తి నుంచి వచ్చింది. ఈయనకు పిల్లలంటే ఎంతో ప్రేమ. పిల్లలపై ఉన్న ప్రేమతో చూడగానే చిన్నారులు ఇష్టపడేలా ఎరుపు, తెలుపు రంగు దుస్తులతో రెడీ అయ్యి, ప్రతి క్రిస్మస్‌కి చిన్నపిల్లలందరికీ బహుమతులు ఇస్తుండే వాడు. అప్పటి నుంచి శాంతాక్లాజ్ గిఫ్ట్స్ అనే ఆచారం పాపులర్ అయింది.
క్రిస్మస్ ట్రీ
క్రిస్మస్ ట్రీ అనేది కేవలం సెలబ్రేషన్స్ కోసం పెట్టడమే కాదు. ఎప్పుడూ తాజాగా కనిపించే ఫిర్ చెట్టు జీవితంలో కొత్త ఆశలను సూచిస్తుందని చెప్తారు. దేవదూతలరాకకు చిహ్నంగా అలాగే.. జీవితంలో కొత్త ఆశలు చిగురించాలనే అభిలాషతో ఈ చెట్టును పెట్టడం ఆనవాయితీగా వస్తుంది.
మిస్టేల్టోయ్ కిస్
ఈ ఆచారం గురించి చాలా తక్కువమందికి తెలుసు. ఇది వెస్ట్రన్ దేశాల్లో అమలులో ఉంది. మిస్టేల్టోయ్ ఓక్ చెట్లు నుండి కట్ చేసి తలుపులు, తోరణాల దగ్గర వేలాడదీస్తారు. ఒక అమ్మాయి, అబ్బాయి ఈ చెట్టు కిందకు వస్తే వారు ముద్దు పెట్టుకోవాలి. గ్రీకువివాహ ఆచారాల్లో ఇదొకటి.
మిడ్‌నైట్ మాస్
జీసస్ క్రైస్ట్ తెల్లవారుజామున పుట్టారు. దానికి సూచనగానే ప్రార్ధనలు అర్థరాత్రి నుంచి మొదలవుతాయి. అందుకే ప్రతి చర్చిలో మిడ్ నైట్ నుంచి కూడికలు, ప్రేయర్స్ జరుగుతాయి. దీనినే మిడ్‌నైట్ మాస్ అని అంటారు.
క్రిస్టిన్గాలే
ఆరెంజ్ రంగు బంతికి ఎర్రని రిబ్బన్ కట్టి, పైభాగంలో క్యాండిల్ వెలిగిస్తారు. ఈ బంతి నాలుగు దిక్కులా స్టిక్స్ ఉంటాయి. దాన్నే క్రిస్టిన్గాలే అంటారు. ఇందులో ఉండే బంతి భూమిని సూచిస్తుంది.. దానికి చుట్టే రిబ్బన్ జీసస్ రక్తాన్ని సూచిస్తుంది. దేవుడు లోకంలోని మనుషుల పాపాలను రక్తంతో కడుగుతాడని దీనర్థం.
క్రిస్మస్ గిఫ్ట్స్
ఈ రోజున ప్రతిఒక్కరూ బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఇది కేవలం సెలబ్రేషన్ కోసం మాత్రమే కాదు. జీసస్ క్రైస్ట్ జన్మించినప్పుడు ఆయనకు ముగ్గురు జ్ఙానులు బహుమతులు ఇచ్చారట. దానికి సింబాలిక్‌గా ఈ ఆచారం కంటిన్యూ అవుతోంది.
క్రిస్మస్ వైన్
క్రిస్టియన్స్ ఈ రోజు తప్పనిసరిగా క్రిస్మస్ వైన్ తాగాలని చెప్తుంటారు. ఎందుకంటే.. క్రిస్మస్ వైన్‌ని జీసస్ రక్తంగా భావిస్తారు. దీనిని తీసుకోవడం వల్ల వారిలోని చెడు పోతుందిని ఓ నమ్మకం. అలా ఇది పుట్టుకొచ్చింది.