Telugu Global
Cinema & Entertainment

సాయితేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్

మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది సోలో బ్రతుకే సో బెటర్ సినిమా. క్రిస్మస్ కానుకగా రాబోతున్న ఈ సినిమా సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలవబోతోంది. అవును.. అతడి కెరీర్ లో కనివినీ ఎరుగని రీతిలో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. దీనికి కారణం కరోనా. కరోనాతో లాక్ డౌన్ పడి టాలీవుడ్ స్తంభించిపోయింది. ఆ తర్వాత థియేటర్లు తెరిచినా రెస్పాన్స్ అంతంతమాత్రంగానే ఉంది. పైగా చాలా చోట్ల సింగిల్ స్క్రీన్స్ […]

సాయితేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్
X

మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది సోలో బ్రతుకే సో బెటర్ సినిమా. క్రిస్మస్ కానుకగా రాబోతున్న ఈ సినిమా సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలవబోతోంది. అవును.. అతడి కెరీర్ లో కనివినీ ఎరుగని రీతిలో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. దీనికి కారణం కరోనా.

కరోనాతో లాక్ డౌన్ పడి టాలీవుడ్ స్తంభించిపోయింది. ఆ తర్వాత థియేటర్లు తెరిచినా రెస్పాన్స్ అంతంతమాత్రంగానే ఉంది. పైగా చాలా చోట్ల సింగిల్ స్క్రీన్స్ కూడా తెరుచుకోలేదు. ఇలాంటి టైమ్ లో సాయితేజ్ సినిమా థియేట్రికల్ మార్కెట్ కు ఓ కొత్త ఊపు తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు థియేటర్లన్నీ ఖాళీగా ఉండడంతో.. సాయితేజ్ కు కావాల్సినన్ని స్క్రీన్స్ దొరికాయి. అలా సాయితేజ్ సినిమా రికార్డు స్థాయి థియేటర్లలో ఓపెన్ అవుతోంది.

సాధారణ పరిస్థితుల్లో ఓ సినిమాకు థియేటర్లు దొరకడం ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. థియేటర్ యాజమాన్యాలతో నిర్మాతలు 6 నెలల ముందే ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భాలున్నాయి. అలాంటిది ఈసారి థియేటర్ యాజమాన్యాలే, సాయితేజ్ సినిమాను తమకు ఇవ్వమంటూ రివర్స్ లో అడగడం నిజంగా ఎనిమిదో వింత అంటున్నాయి సినీవర్గాలు. అలా రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ అవుతోంది సోలో బ్రతుకే సో బెటర్. ఏపీలో దాదాపు ప్రతి మెయిన్ సెంటర్ లో ఈ సినిమా పడుతోంది. ఇటు తెలంగాణలో దాదాపు 3వందలకు పైగా స్క్రీన్స్ దీనికి దొరికాయి.

First Published:  23 Dec 2020 5:30 AM IST
Next Story