Telugu Global
International

క్రిస్మస్ కోసం ఆన్ లైన్ బహుమతులు

క్రిస్మస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది గిఫ్ట్స్.. పిల్లలకు శాంతా క్లాజ్ ఇచ్చే గిఫ్ట్స్‌తో పాటు ఒకరికొకరు ప్రేమతో ఇచ్చిపుచ్చుకునే బహుమతులు కూడా ఈ పండుగలో ఎంతో ప్రత్యేకం. కానీ ఈసారి కరోనా వల్ల బయటకెళ్లి గిఫ్ట్స్ తెచ్చి ఇవ్వడం కొంత ఇబ్బందే. అందుకే దానికి బదులు కొత్తగా కొన్ని వర్చువల్ గిఫ్ట్స్‌ను ట్రై చేయొచ్చు. అదెలా అంటే.. క్రిస్మస్ పండుగ వస్తుందంటే.. స్టార్ వెలుగులు, ప్రార్ధనలు, క్రిస్మస్ ట్రీ అలంకరించడంతో పాటు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. […]

క్రిస్మస్ కోసం ఆన్ లైన్ బహుమతులు
X

క్రిస్మస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది గిఫ్ట్స్.. పిల్లలకు శాంతా క్లాజ్ ఇచ్చే గిఫ్ట్స్‌తో పాటు ఒకరికొకరు ప్రేమతో ఇచ్చిపుచ్చుకునే బహుమతులు కూడా ఈ పండుగలో ఎంతో ప్రత్యేకం. కానీ ఈసారి కరోనా వల్ల బయటకెళ్లి గిఫ్ట్స్ తెచ్చి ఇవ్వడం కొంత ఇబ్బందే. అందుకే దానికి బదులు కొత్తగా కొన్ని వర్చువల్ గిఫ్ట్స్‌ను ట్రై చేయొచ్చు. అదెలా అంటే..

క్రిస్మస్ పండుగ వస్తుందంటే.. స్టార్ వెలుగులు, ప్రార్ధనలు, క్రిస్మస్ ట్రీ అలంకరించడంతో పాటు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. మరోపక్క ప్యాండెమిక్ ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. అలాగని పండుగ సెలబ్రేషన్స్‌ను పక్కన పెట్టలేం కదా.. అందుకే ఒకరికొకరు గిఫ్ట్స్ పంపుకోవడం ద్వారా క్రిస్మస్‌ను మరింత స్పెషల్‌గా జరుపుకోవచ్చు. అందులో భాగంగానే ఈసారి కొత్తగా డిజిటల్ గిఫ్ట్స్‌ను ట్రై చేద్దాం.

స్ట్రీమింగ్ సర్వీస్ మెంబర్‌‌షిప్

జనమంతా నాలుగు గోడలకే పరిమితమైన ఈ రోజుల్లో హోం ఎంటర్‌‌టైన్‌మెంట్‌ను మించిన వినోదమేముంటుంది. అందుకే ఒక ఓటీటీ మెంబర్‌‌షిప్ ప్లాన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం ద్వారా మీ ప్రేమను పంచుకోండి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీఫైవ్, ఆహా, వూట్ లాంటి సబ్ స్క్రిప్షన్స్‌లో మీ ప్రియమైన వాళ్లకు నచ్చినదానికి బహుమతిగా ఇవ్వొచ్చు. వీటిలో మంత్లీప్లాన్స్ నుంచి ఇయర్లీ ప్లాన్స్ వరకూ ఉంటాయి.

ఫుడ్ కూపన్స్

స్నేహితులు, బంధువుల్లో భోజనప్రియులు చాలామందే ఉంటారు. అలాంటి వారికి బహుమతి ఇవ్వాలనుకుంటే.. కొత్తగా వారికోసం ఫుడ్ కూపన్స్ లేదా ఫుడ్ డెలివరీ మెంబర్ షిప్‌ను కొనుగోలు చేసి ఇవ్వొచ్చు. వీటి ద్వారా ఫాస్ట్ డెలివరీ , ఎక్స్ ట్రా డిస్కౌంట్స్ లభిస్తాయి. రెగ్యులర్‌‌గా ఫుడ్ ఆర్డర్ చేసేవారికి ఈ కూపన్స్, మెంబర్‌‌షిప్‌లు ఎంతగానో హెల్ప్ అవుతాయి.

షాపింగ్ వౌచర్స్

షాపింగ్ ప్రియులకు క్రిస్మస్ షాపింగ్ ఎంతో స్పెషల్. మంచి బ్రాండ్ లేదా స్టోర్ వౌచర్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం ద్వారా షాపింగ్ ప్రియులకు మంచి బహుమతి ఇచ్చినవారవుతారు.

వర్చువల్ మెంబర్ షిప్

అంతా డిజిటల్‌గా నడుస్తున్న ఈ టైంలో జిమ్, యోగా, ఆన్‌లైన్ కోర్సులు లాంటి వాటిని కూడా గిఫ్ట్స్‌గా ఇవ్వొచ్చు. ఫిట్‌నెస్ ప్రియులు చాలామంది ఇప్పుడు జిమ్ క్లాసులను మిస్ అవుతున్నారు. అలాంటి వాళ్లకు ఆన్‌లైన్ జిమ్ మెంబర్ షిప్ ఇవ్వడం ద్వారా మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది.

ఈ గ్రీటింగ్స్

ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయడంలో గ్రీటింగ్స్‌ది చాలా ప్రత్యేకమైన స్థానం. అందుకే ఈ గ్రీటింగ్స్ ద్వారా గ్రీటింగ్ కార్డ్‌ను మెయిల్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో గ్రీటింగ్స్ పంపడానికి బోలెడు పోర్టల్స్ అందుబాటులో ఉన్నాయి. వేల రకాల డిజైన్లు, టెక్స్ట్‌లు ఉంటాయి. ప్రియమైన వారి కోసం ఇలా కూడా ప్రేమను తెలపొచ్చు.

ఈ బుక్స్, ఆడియో బుక్స్

పుస్తకప్రయుల కోసం.. ఇప్పుడు రకరకాల బుక్స్ ఈ బుక్స్ లేదా ఆడియో బుక్స్ రూపంలోకి అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్ కిండిల్ సబ్ స్క్రిప్షన్ లేదా అమేజాన్ ఆడిబుల్ సబ్ స్క్రిప్షన్ ద్వారా ప్రియమైన వారికి పుస్తకాలను బహుమతిగా ఇవ్వొచ్చు.

ఈ డిజిటల్ ఏజ్‌లో ప్రేమను, శుభాకాంక్షలు తెలపడానికి ఎన్నో వర్చువల్ మార్గాలున్నాయి. అవతలి ఇష్టాలు, ఇంట్రెస్ట్ ను బట్టి రకరకాల వర్చువల్ గిఫ్ట్ ఐడియాలను ట్రైచేయొచ్చు. బయటకు వెళ్లకుండానే క్రిస్మస్ బహుమతులను పంచుకోవచ్చు.

First Published:  23 Dec 2020 4:10 AM GMT
Next Story