మహారాష్ట్రలో రాత్రి కర్ప్యూ... లండన్ వైరస్‌తో డేంజరే !
బ్రిటన్‌లో కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభణ కొనసాగుతోంది. ఈ వైరస్ పంజా విసరడంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై కేంద్రం నిషేధం విధించింది. డిసెంబర్ 31 వరకు ఈ బ్యాన్ కొనసాగుతోంది. ఇప్పటికే యూరప్ దేశాలు కూడా విమానాలు రద్దు చేశాయి. మహారాష్ట్రలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. జనవరి 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజులపాటు […]

బ్రిటన్‌లో కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభణ కొనసాగుతోంది. ఈ వైరస్ పంజా విసరడంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై కేంద్రం నిషేధం విధించింది. డిసెంబర్ 31 వరకు ఈ బ్యాన్ కొనసాగుతోంది. ఇప్పటికే యూరప్ దేశాలు కూడా విమానాలు రద్దు చేశాయి.
మహారాష్ట్రలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. జనవరి 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజులపాటు క్వారంటైన్ తప్పనిసరి చేశారు. గత వారం రోజుల ముందు వచ్చిన వారికి కూడా కరోనా టెస్టులు నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
డిసెంబర్ 22 లోపు బ్రిటన్ నుంచి ఐదు విమానాలు ముంబైకి వస్తున్నాయి. దాదాపు వెయ్యి మందికి పైగా ప్రయాణికులు వీటిలో వస్తారు. వీరిని క్వారంటైన్ పంపేందుకు ముంబై కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది.
పాత కరోనా వైరస్ కంటే కొత్త లండన్ కరోనా వైరస్ 70 శాతం ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. దీంతో ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలనేది నిపుణుల మాట. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సమయంలో జనాల్లోకి వెళ్లకపోవడమే మంచిది అని అంటున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు తగ్గాయి. ఇప్పుడు 2,300కి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. సెప్టెంబర్ మధ్య కాలంలో 22 వేలకు పైగా కేసులు ప్రతిరోజూ రికార్డు అయ్యాయి. ఏడాది కాలంలో 19 లక్షలకు పైగా కేసులు బయటపడ్డాయి. ఇప్పటివకూ 48,700 మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 63వేల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.