Telugu Global
International

వైరస్‌లో కొత్తరకం... ఇప్పుడేం చేయాలి?

త్వరలో వ్యాక్సిన్ రాబోతోందన్న పాజిటివ్ మూడ్‌లో అందరూ ఉంటే.. ఉన్నట్టుండి కరోనాలో కొత్త రకం వచ్చిందన్న వార్తలు తెగ టెన్షన్ పెట్టేస్తున్నాయి. అసలేంటీ కొత్త రకం? ఇది నిజంగా అంత ప్రమాదకరమా? ఇప్పుడు మనమేం చేయాలి? మొట్ట మొదటగా వచ్చిన కరోనా వైరస్ కంటే ఇప్పుడు అప్‌డేట్ అయిన కొత్తరకం ఎందుకు ప్రమాదమంటే.. కరోనా వైరస్ దానిలో అది పరివర్తనం చెందుతూ.. దాని కెపాసిటీని పెంచుకుంటూ పోతుంది. అలా పెంచుకున్న రకమే ఈ కొత్త స్ట్రెయిన్. ఈ […]

వైరస్‌లో కొత్తరకం... ఇప్పుడేం చేయాలి?
X

త్వరలో వ్యాక్సిన్ రాబోతోందన్న పాజిటివ్ మూడ్‌లో అందరూ ఉంటే.. ఉన్నట్టుండి కరోనాలో కొత్త రకం వచ్చిందన్న వార్తలు తెగ టెన్షన్ పెట్టేస్తున్నాయి. అసలేంటీ కొత్త రకం? ఇది నిజంగా అంత ప్రమాదకరమా? ఇప్పుడు మనమేం చేయాలి?
మొట్ట మొదటగా వచ్చిన కరోనా వైరస్ కంటే ఇప్పుడు అప్‌డేట్ అయిన కొత్తరకం ఎందుకు ప్రమాదమంటే.. కరోనా వైరస్ దానిలో అది పరివర్తనం చెందుతూ.. దాని కెపాసిటీని పెంచుకుంటూ పోతుంది. అలా పెంచుకున్న రకమే ఈ కొత్త స్ట్రెయిన్. ఈ కొత్తరకానికి అంతకు ముందు వైరస్ కంటే 70 శాతం ఎక్కువ సోకే సామర్ధ్యం ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. అందుకే ఈ కొత్తరకానికి కాస్త భయపడాల్సి వస్తుంది. ఈ కొత్తరకం వైరస్ లండన్‌లో గుర్తించారు. కొద్దికొద్దిగా ఇది వ్యాపించే రేటు పెరుగుతూ పోతుంది.

ఇంకా క్లారిటీ లేదు

ఈ కొత్త వేరియంట్ ఎలా తయారైందనే విషయంపై ఇంకా క్లారిటీలేదు. కరోనా వైరస్ శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత లోపలి పరిస్థితులకు అనుగుణంగా అప్‌డేట్ అయ్యి పరివర్తనం చెంది ఉండొచ్చు అని పరిశోధకులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ కొత్తరకానికి కేవలం వ్యాపించే సామర్ధ్యం మాత్రమే ఎక్కువా లేదా ఇది సోకిన వారు మరణించే రేటు కూడా పెరిగిందా అనే విషయంపై క్లారిటీ లేదు.

రకరకాలుగా మారుతూ…

కరోనా వైరస్ వూహాన్‌లో మొదలైన తర్వాత ప్రపంచమంతటా ఏవిధంగా వ్యాపించిందో అందరికీ తెలిసిందే. అయితే మొట్టమొదట గుర్తించిన కరోనా వైరస్‌కు ఇప్పుడు ప్రపంమంతటా ఉన్న వైరస్‌కు జన్యుపరంగా చాలా తేడాలున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. ఇది స్థిరంగా ఉండకుండా ప్రాంతం, వాతావరణాన్ని బట్టి ఒక్కోచోట ఒక్కోలా మారుతూ వస్తుంది. అలా ఇప్పటికీ ఇందులో ఎన్నో రకాల మ్యుటేషన్‌లు జరిగాయి. ఈ వైరస్ ఆస్ట్రేలియాలో ఒకరకంగా, ఆఫ్రికాలో ఒకరకంగా, యూరప్‌లో ఒకరకంగా ఇలా రకరకాలుగా మార్పులు చెందుతూ వస్తుంది. అయితే ఇప్పుడు కనిపెట్టిన కొత్తరకం స్ట్రెయిన్ అన్ని రకాల మ్యుటేషన్ల కంటే వ్యాపించడంలో ముందుంది. ఇదే ఇప్పుడు అందరినీ భయపెట్టే విషయంగా మారింది.

సింప్టమ్స్ ఎలా ఉంటాయి?

ఇప్పటివరకూ ఈ కొత్తరకం వైరస్ బారిన పడినవాళ్లలో కొత్త సింప్టమ్స్ ఏవీ గుర్తించలేదని డాక్టర్లు చెప్తున్నారు. శ్వాస ఆడకపోవడం, వాసన లేకపోవడం, జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి కామన్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయని అంటున్నారు.

రాబోతున్న వ్యాక్సిన్‌లు పని చేస్తాయా?

ఈ కొత్త రకం స్ట్రెయిన్ వేగంగా అప్‌డేట్ అవుతుంది. మరో పక్క వ్యాక్సిన్‌లు కూడా వేగంగానే రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పుడు తయారు చేస్తున్న వ్యాక్సిన్ సరిగ్గా పని చేస్తే.. అది ఈ కొత్తరకం స్ట్రెయిన్‌ను కూడా నిరోధిస్తుంది. కానీ ఈ లోపే తక్కువ సమయంలో ఇది ఎక్కువమందికి వ్యాపిస్తే అది వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్‌కు పెద్ద సమస్యగా మారొచ్చు.

మనమేం చేయాలి?

ఇప్పటికే చాలామంది కరోనా అంతా తగ్గింది అన్నట్టుగా జాగ్రత్తలను పక్కనపెడుతున్నారు. మాస్క్, శానిటైజర్ల వాడకాన్ని చాలామంది తగ్గించేశారు. మరో పక్క వైరస్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ మరింత వేగంగా వ్యాపిస్తోంది. అందుకే వైరస్‌ను చిన్నచూపు చూడకుండా అంతకుముందులా అవే జాగ్రత్తలు కంటిన్యూ చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. దాదాపుగా వ్యాక్సిన్ రాబోతున్న సమయంలో కొత్తగా రిస్క్ తెచ్చిపెట్టుకోకుండా మరికొన్ని రోజుల ఓపికతో అన్ని సేఫ్టీ మెజర్స్ పక్కాగా పాటించడమే మేలు.

First Published:  22 Dec 2020 3:04 AM GMT
Next Story