నాగచైతన్య మళ్లీ మొదలుపెట్టాడు
ఒక సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా స్టార్ట్ చేయడం నాగచైతన్య స్టయిల్. రీసెంట్ గా లవ్ స్టోరీ సినిమాను కంప్లీట్ చేసిన ఈ హీరో, ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు. నాగచైతన్య హీరోగా ఇవాళ్టి నుంచి థ్యాంక్ యు మూవీ సెట్స్ పైకొచ్చింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఈరోజు చైతూపై ఫస్ట్ షాట్ తీశారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు […]

ఒక సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా స్టార్ట్ చేయడం నాగచైతన్య స్టయిల్. రీసెంట్ గా లవ్ స్టోరీ సినిమాను కంప్లీట్ చేసిన ఈ హీరో, ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు.
నాగచైతన్య హీరోగా ఇవాళ్టి నుంచి థ్యాంక్ యు మూవీ సెట్స్ పైకొచ్చింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఈరోజు చైతూపై ఫస్ట్ షాట్ తీశారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది.
సెట్స్ పైకొచ్చిన మొదటి రోజే వర్కింగ్ స్టిల్ కూడా రిలీజ్ చేశారు. విక్రమ్ కుమార్ పై ఫస్ట్ వర్కింగ్ స్టిల్ రిలీజైంది. నాగచైతన్య-విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మనం’ ఓ క్లాసిక్ మూవీ. అలాంటి కాంబినేషన్‌లో ఇప్పుడు థ్యాంక్ యూ మూవీ రాబోతోంది.
ఈ సినిమాలో హీరోయిన్ ను ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు. ప్రస్తుతానికైతే రకుల్ పేరును పరిశీలిస్తున్నారు. తమన్ ఈ ప్రాజెక్టుకు సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ 3 ట్యూన్స్ కంపోజ్ చేశాడు.
#ThankYouTheMovie …SHOOT BEGINS! @chay_akkineni @MusicThaman @pcsreeram @BvsRavi @Vikram_K_Kumar #DilRaju #Shirish #HarshithReddy pic.twitter.com/ErxR550r2w
— Sri Venkateswara Creations (@SVC_official) December 21, 2020