వెండితెర విలన్ కి అరుదైన గౌరవం
సిల్వర్ స్ర్కీన్ మీద సోనూ సూద్ ఒక విలన్. కానీ నిజ జీవితంలో మాత్రం అతడొక హీరో. కరోనా సంక్షోభ కాలంలో వేలాది మంది వలస కూలీలకు అండగా నిలిచాడు ఈ వెండితెర విలన్. కాలి నడకన స్వగ్రామాలకు పయనమైన వేలాది మంది కూలీలను స్వంత ఖర్చులతో గమ్యానికి చేర్చాడు. బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా కూలీలను స్వస్థలాలకు చేర్చి అభినవ కర్ణుడిగా క్తీరించబడ్డాడు. అంతటితో ఆగకుండా ఆస్థులను అమ్మి మరీ ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించాడు. […]

సిల్వర్ స్ర్కీన్ మీద సోనూ సూద్ ఒక విలన్. కానీ నిజ జీవితంలో మాత్రం అతడొక హీరో. కరోనా సంక్షోభ కాలంలో వేలాది మంది వలస కూలీలకు అండగా నిలిచాడు ఈ వెండితెర విలన్. కాలి నడకన స్వగ్రామాలకు పయనమైన వేలాది మంది కూలీలను స్వంత ఖర్చులతో గమ్యానికి చేర్చాడు. బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా కూలీలను స్వస్థలాలకు చేర్చి అభినవ కర్ణుడిగా క్తీరించబడ్డాడు.
అంతటితో ఆగకుండా ఆస్థులను అమ్మి మరీ ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించాడు. నిరుపేదలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించి ప్రశంసలు పొందాడు.
ప్రభుత్వాలు సైతం విస్మరించిన వలసకూలీలకు నేనున్నాననే భరోసానిచ్చారు సోనూసూద్. పాలకులు సైతం చిన్నబుచ్చుకునేలా తన సేవాకార్యక్రమాల్ని కొనసాగిస్తున్న సోనూసూద్ ప్రజల్లో గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచాడు. సోనూ సూద్ సేవలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డు అందజేసింది.
ఇప్పుటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను సైతం సొంతం చేసుకున్న సోనూసూద్ కి మరో అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ప్రజలు ఆయన కోసం ఏకంగా గుడిని నిర్మించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బా తండాలో స్థానికులు ఆయన కోసం ఆలయాన్ని నిర్మించారు. స్థానిక అధికారుల సహకారంతో తండా వాసులు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
మృత్యు ముఖంలోకి నడుస్తున్న వేలాది మంది వలస కూలీలకు సోనూసూద్ అండగా నిలబడడం దేశ ప్రజలందరి దృష్టినీ ఆకర్షించింది. ఎంతగా అంటే… కష్టాల్లో ఉన్నవాళ్లు ప్రభుత్వాన్ని, అధికారులని ఆశ్రయించకుండా నేరుగా సోనూసూద్ సహకారాన్నే కోరుతున్నారు. ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమైనవారు, నిరుద్యోగంతో సతమతమవుతున్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు… ఇలా ఏ కష్టమొచ్చినా సోనూసూద్ సహాయాన్ని కోరుతున్నారు. అలాంటి వారందరి కష్టాలూ తీర్చడంలో సోనూసూద్ ఎక్కడా రాజీపడకుండా కృషి చేస్తూనే ఉన్నారు.
ఈ కృషి ఫలితమే ఆయన ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయాడు. కాగా… ఇప్పటికే సోనూసూద్ తాను దేవుడిని కాదని, తన కోసం ఎవరూ గుడులు కట్టవద్దని ప్రకటించారు. జర్నలిస్టు అయ్యర్ తో కలిసి తాను వెలువరించిన పుస్తకానికి సైతం ‘ఐ యామ్ నో మేసయ్య’ అనే పేరును పెట్టారు సోనూ.