రైతుల లైవ్ కనెక్షన్ కట్... సోషల్ మీడియా ప్రచారంపై కేంద్రం కన్ను !
హస్తినకు సెగ తగిలింది. ఓ వైపు టెంపరేచర్ పడిపోతోంది. మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇంత చలిలో కూడా కేంద్రానికి చెమటలు పట్టిస్తున్నారు రైతులు. రైతుల దీక్షతో కేంద్రం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. బెంగాల్ ఎన్నిక ల జోష్‌తో బీజేపీ నేతలు కొంచెం ఆనందపడుతున్నారు. కానీ రైతుల సమస్య వచ్చేసరికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోతున్నారు. ఇప్పుడు రైతుల లైవ్ వీడియోను సోషల్ మీడియాలో ఆపించేశారు కేంద్ర పెద్దలు. కొత్త వ్యవసాయ […]

హస్తినకు సెగ తగిలింది. ఓ వైపు టెంపరేచర్ పడిపోతోంది. మూడు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇంత చలిలో కూడా కేంద్రానికి చెమటలు పట్టిస్తున్నారు రైతులు.
రైతుల దీక్షతో కేంద్రం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. బెంగాల్ ఎన్నిక ల జోష్‌తో బీజేపీ నేతలు కొంచెం ఆనందపడుతున్నారు. కానీ రైతుల సమస్య వచ్చేసరికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోతున్నారు. ఇప్పుడు రైతుల లైవ్ వీడియోను సోషల్ మీడియాలో ఆపించేశారు కేంద్ర పెద్దలు.
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు 25 రోజులగా ఉద్యమిస్తున్నారు. రోజూ ఏదో ఒక రకంగా ఉద్యమ ఉధృతి పెరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా రైతులకు మంచి మద్దతు లభిస్తోంది. దీంతో రైతులు ఆందోళనపై కేంద్రం మరో రకంగా ఉక్కుపాదం మోపుతోంది. రైతుల ఆందోళనలు లైవ్‌లు ఇస్తున్న ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగమ్ అకౌంట్లను నిలిపివేసింది. ఆన్‌లైన్ లైవ్‌లు కంటెంట్‌లో సెన్సిటివిటీ ఇష్యూ ఉందని ఆదివారం ఒక్కసారిగా రైతుల లైవ్ ను నిలిపివేసింది.
రైతుల ఆందోళనలపై కేంద్రం ఏం చేయలేకపోతోంది? చర్చల పేరుతో రైతు సంఘాల ప్రతినిధులను పిలిచింది. కానీ కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలనేది తమ ప్రధాన డిమాండ్ అని రైతులు ఖరాఖండిగా తేల్చి చెప్పారు. దీంతో రైతుల ఉద్యమాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక కేంద్ర పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.
మరోవైపు రైతుల ఉద్యమానికి మద్దతు దొరక్కుండా ఎలా సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తారని…. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగమ్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.