మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన తమన్
వరుస అవకాశాలతో దూసుకుపోతున్న తమన్ మరో క్రేజీ ఆఫర్ అందుకున్నాడు. ఇప్పటికే పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ అందుకున్న ఈ సంగీత దర్శకుడు.. ఇప్పుడు పవన్ నెక్ట్స్ మూవీని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అవును.. అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు కూడా తమనే సంగీతం అందించబోతున్నాడు. అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇతడి రిఫరెన్స్ తోనే తమన్ కు మరోసారి పవన్ సినిమాకు […]

వరుస అవకాశాలతో దూసుకుపోతున్న తమన్ మరో క్రేజీ ఆఫర్ అందుకున్నాడు. ఇప్పటికే పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాకు మ్యూజిక్ అందించే ఛాన్స్ అందుకున్న ఈ సంగీత దర్శకుడు.. ఇప్పుడు పవన్ నెక్ట్స్ మూవీని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అవును.. అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు కూడా తమనే సంగీతం అందించబోతున్నాడు.
అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇతడి రిఫరెన్స్ తోనే తమన్ కు మరోసారి పవన్ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ దక్కింది. త్వరలోనే ఈ రీమేక్ కు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేస్తాడు తమన్.
ఇక ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ ఏంటంటే.. ఇందులో మరో నటుడిగా రానా ఫిక్స్ అయ్యాడు. ముందుగా ఇతడి పేరునే అనుకున్నప్పటికీ మధ్యలో గోపీచంద్, సాయిధరమ్ తేజ్ లాంటి పేర్లు వినిపించాయి. కానీ మేకర్స్ రానాకే ఫిక్స్ అయ్యారు. మరో 2 రోజుల్లో రానా పేరును అధికారికంగా ప్రకటించబోతున్నారు.
సినిమాకు సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత పొలాచ్చిలో ఉంటుంది. ఈ మేరకు ఆర్ట్ డైరక్టర్ ప్రకాష్, ప్రస్తుతం పొలాచ్చీలో తన వర్క్ స్టార్ట్ చేశాడు.