ఈ జాబ్సే ఇప్పుడు ట్రెండింగ్...
ఒక పక్క కోవిడ్‌తో చాలా ఇండస్ట్రీలు డీలా పడిపోతుంటే మరో పక్క కొన్ని ఇండస్ట్రీలు మాత్రం అంతకుముందెన్నడూ లేని విధంగా జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. ఈ టైంలో జాబ్ దొరక్క ఇబ్బంది పడుతున్నట్లయితే.. ఈ ఐదు జాబ్ ప్రొఫైల్స్‌లో ఒకసారి ట్రై చేస్తే సరి. ఫ్రీ ల్యాన్సింగ్ కోవిడ్‌తో ఉద్యోగాలు కోల్పోయిన చాలా మంది యంగ్ ఎంప్లాయిస్ ఉపాధి కోసం ఫ్రీ ల్యాన్సింగ్ బాట పట్టారు. దాంతో ఫ్రీల్యాన్సింగ్ ఇండస్ట్రీలో అవకాశాలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇంటి […]

ఒక పక్క కోవిడ్‌తో చాలా ఇండస్ట్రీలు డీలా పడిపోతుంటే మరో పక్క కొన్ని ఇండస్ట్రీలు మాత్రం అంతకుముందెన్నడూ లేని విధంగా జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. ఈ టైంలో జాబ్ దొరక్క ఇబ్బంది పడుతున్నట్లయితే.. ఈ ఐదు జాబ్ ప్రొఫైల్స్‌లో ఒకసారి ట్రై చేస్తే సరి.
ఫ్రీ ల్యాన్సింగ్
కోవిడ్‌తో ఉద్యోగాలు కోల్పోయిన చాలా మంది యంగ్ ఎంప్లాయిస్ ఉపాధి కోసం ఫ్రీ ల్యాన్సింగ్ బాట పట్టారు. దాంతో ఫ్రీల్యాన్సింగ్ ఇండస్ట్రీలో అవకాశాలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇంటి నుంచే పని చేయిస్తూ కావాల్సిన ప్రొడక్టివిటీని రాబట్టుకోడానికి కంపెనీలు కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నాయి.
ఈ విధానంతో కంపెనీలకు ఎన్నో విధాలుగా కలిసొస్తుంది. అందుకే చాలా ఇండస్ట్రీలు ఫ్రీ ల్యాన్సింగ్ స్టైల్‌ను ఫాలో అవుతున్నాయి. ఎస్‌ఈఓ సర్వీసెస్, మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్, ఎడిటింగ్, కోడింగ్, డేటా ఎంట్రీ, డీజైనింగ్ లాంటి ఇండస్ట్రీల్లో ఫ్రీల్యాన్సింగ్‌కు స్కోప్ ఎక్కువ.
హెల్త్ కేర్
హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడూ అత్యవసరమైన ఇండస్ట్రీ. కోవిడ్ లాంటి ప్యాండెమిక్ సిచ్యుయేషన్ లో ఇది మరింత ఊపందకుంది. హెల్త్ కేర్ వర్కర్స్ అవసరం ఇప్పుడు ఎంతగానో ఉంది. మెడికల్ డిగ్రీ చదువుకున్న వాళ్లకు ఈ టైంలో ఉపాధికి ఎలాంటి లోటు ఉండదు.
రిటైల్ సర్వీసెస్
రిటైల్ సర్వీసెస్‌లో రకరకాల ఉపాధి అవకాశాలుంటాయి. ఇది కూడా ఒక నిత్యవసరం లాంటిది. రిటైల్ ఇండస్ట్రీలో వర్కర్స్‌కు ఇప్పుడు హై డిమాండ్ ఉంది. రిటైల్ మేనెజర్స్, రిటైల్ వర్కర్స్, రెసెప్షనిస్ట్స్ లాంటి పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అయ్యే ఉద్యోగాలకు ఎప్పుడూ డిమాండ్ ఉండనే ఉంటుంది. అలాగే వీటిలో కాంపిటీషన్ కూడా ఎక్కువే.
షిప్పింగ్/ లాజిస్టిక్స్
లాజిస్టిక్స్ సర్వీసెస్ కు ఎప్పటినుంచో మంచి డిమాండ్ ఉంది. పైగా జనాలు బయటకి పోలేని ఇలాంటి ప్యాండెమిక్ సిచ్యుయేషన్స్‌లో డెలివరీ/షిప్పింగ్ లాంటి లాజిస్టిక్ సర్వీసెస్ అవసరం చాలానే ఉంది.
వేర్ హౌస్ వర్కర్స్, ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్, ప్యాకేజ్ వర్కర్స్, ప్యాకేజ్ మేనేజర్స్, స్టోర్ మెనేజర్స్ లాంటి ఉద్యోగాలకు ఈ టైంలో మంచి అవకాశాలున్నాయి.
ఐటి/కోడింగ్
జనం ఆన్‌లైన్‌లో గడిపే సమయం రోజురోజుకీ పెరిగిపోతుంది. ఆన్‌లైన్ యూజర్స్ పెరిగే కొద్దీ అందులో వచ్చే సమస్యలు, కొత్త కొత్త ఫీచర్లు పెరుగుతూనే ఉంటాయి. దాంతో వాటిని ఆపరేట్ చేసే ఐటి ఇంజనీర్స్‌కు, కోడింగ్ తెలిసిన వాళ్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. పైగా ఇందులో ఫ్రీల్యాన్సింగ్ సౌలభ్యం కూడా ఎక్కువే. అందుకే ఈ టైంలో కోడింగ్, సాఫ్ట్ వేర్ టెక్నాలజీ తెలిసిన వాళ్లకు ఉపాధికి ఎలాంటి లోటు లేదు.
ప్యాండెమిక్ టైంలో అన్ని పనులు ఆగిపోవడంతో.. చాలా ఇండస్ట్రీలు కుదేలయ్యాయి. ఇప్పుడిప్పుడే అన్నీ తిరిగి పుంజుకుంటున్నాయి. వాటిలో ఈ ఐదు ఇండస్ట్రీలు ఇప్పుడు బూమ్‌లో ఉన్నాయి. అలా అని మిగతా చోట్ల అవకాశాలు లేవని కాదు. సరైన స్కిల్స్ ఉంటే ఉపాధి ఇవ్వడానికి సంస్థలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి.