Telugu Global
Cinema & Entertainment

నిర్మాతల మండలి నిర్ణయాలు

కరోనా వల్ల టాలీవుడ్ లో పరిస్థితులు మారిపోవడంతో, నిర్మాతల మండలి కూడా తమకు ఏం కావాలో ప్రత్యేకంగా చర్చించింది. ప్రత్యేకమంగా సమావేశమైన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు.. కీలకమైన అంశాలపై చర్చించారు. ఆ నివేదికను ఫిలింఛాంబర్ కు పంపించారు. చర్చించిన అంశాల్ని వరుసగా వెల్లడించిన నిర్మాతల మండలి.. దాదాపు తమ నిర్ణయాన్ని పరోక్షంగా చెప్పినట్టయింది. మల్టీప్లెక్స్‌లు, ఇతర థియేటర్లను పునఃప్రారంభించే అంశంపై ఈ మీటింగులో కొన్ని విషయాలు చర్చించారు. 1. నిర్మాతలు వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ […]

నిర్మాతల మండలి నిర్ణయాలు
X

కరోనా వల్ల టాలీవుడ్ లో పరిస్థితులు మారిపోవడంతో, నిర్మాతల మండలి కూడా తమకు ఏం కావాలో ప్రత్యేకంగా చర్చించింది. ప్రత్యేకమంగా సమావేశమైన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు.. కీలకమైన అంశాలపై చర్చించారు. ఆ నివేదికను ఫిలింఛాంబర్ కు పంపించారు. చర్చించిన అంశాల్ని వరుసగా వెల్లడించిన నిర్మాతల మండలి.. దాదాపు తమ నిర్ణయాన్ని పరోక్షంగా చెప్పినట్టయింది.

మల్టీప్లెక్స్‌లు, ఇతర థియేటర్లను పునఃప్రారంభించే అంశంపై ఈ మీటింగులో కొన్ని విషయాలు చర్చించారు.

1. నిర్మాతలు వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ) ఛార్జీలు చెల్లించరు.
2. కంటెంట్ ట్రాన్స్‌పోర్ట్ కోసం నిర్మాతలు నామమాత్రపు ఛార్జీలు చెల్లిస్తారు.
3. డిజిటల్ ప్రొవైడర్లు తమ రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల ప్రొజెక్టర్లను థియేటర్‌ ఓనర్స్ కొనుగోలు చేయడానికి డిజిటల్ ప్రొవైడర్లు ఒక ఆప్షన్ ఇస్తారు. దీని మూలంగా ప్రకటనల ఆదాయాన్ని స్వీకరించడానికి థియేటర్‌ ఓనర్స్ కు వీలు కల్గుతుంది.
4. థియేటర్ యజమానులు ప్రొజెక్టర్లను కొనుగోలు చేయలేకపోతే, నిర్మాతలు కొంతవరకు కల్పించుకొని వారి ప్రొజెక్టర్లను కొనుగోలు చేయడానికి సహాయం చేస్తారు.
5. పైన ఉదహరించిన 1, 2 మరియు 3 విషయాలు డిజిటల్ ప్రొవైడర్లు అంగీకరించకపోతే, థియేటర్ యజమానులు వారి సొంత ప్రొజెక్టర్లుతో నడిపిస్తారు.

ఈ అంశాలపై 17వ తేదీన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.

First Published:  15 Dec 2020 3:42 PM IST
Next Story