Telugu Global
International

ట్రంప్​ కుట్రలు సాగలేదు... ఇదో గొప్పవిజయం... జో బైడెన్​ ఉద్వేగ ప్రసంగం..!

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ ఉద్వేగంగా ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నికైన మొత్తం 538 మంది ఎలక్టర్లు సోమవారం ఓట్లు వేశారు. బైడెన్‌కు 306 ఓట్లు రాగా, ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చినట్లు సమాచారం. గెలుపు ఇదివరకే ఖాయమైనప్పటికీ లాంఛన ప్రక్రియ కూడా ఇప్పుడు పూర్తయ్యింది. ఈ సందర్భంగా జో బైడెన్​ ఉద్వేగంగా ప్రసంగించారు. ‘అమెరికాలో ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామ్యం నిలబడ్డాయి. ఎన్నికల ప్రక్రియనే ఆపాలని కొందరు చేసిన కుట్రలు ఫలించలేదు. అమెరికా ఆత్మ, […]

ట్రంప్​ కుట్రలు సాగలేదు... ఇదో గొప్పవిజయం... జో బైడెన్​ ఉద్వేగ ప్రసంగం..!
X

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​ ఉద్వేగంగా ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నికైన మొత్తం 538 మంది ఎలక్టర్లు సోమవారం ఓట్లు వేశారు. బైడెన్‌కు 306 ఓట్లు రాగా, ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చినట్లు సమాచారం. గెలుపు ఇదివరకే ఖాయమైనప్పటికీ లాంఛన ప్రక్రియ కూడా ఇప్పుడు పూర్తయ్యింది. ఈ సందర్భంగా జో బైడెన్​ ఉద్వేగంగా ప్రసంగించారు.

‘అమెరికాలో ఎన్నికల వ్యవస్థ, ప్రజాస్వామ్యం నిలబడ్డాయి. ఎన్నికల ప్రక్రియనే ఆపాలని కొందరు చేసిన కుట్రలు ఫలించలేదు. అమెరికా ఆత్మ, ప్రజాస్వామ్యం గెలుపొందాయి. చరిత్రలో మరో పేజీ లిఖితమైంది. నేను మరోసారి స్పష్టం చేస్తున్నాను. నేను అమెరికన్లు అందరికీ అధ్యక్షుడిని. ఎన్నికల ప్రక్రియను ఆపేందుకు ఎన్నో కుట్రలు చేశారు. కుతంత్రాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని , ప్రజల నిర్ణయాన్ని కూడా కొందరు జీర్ణించుకోలేకపోయారు. అటువంటి కుట్రలను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. సుప్రీంకోర్టుకు నేను ధన్యావాదాలు తెలుపుతున్నాను.

అమెరికా ప్రజలు ఇచ్చిన తీర్పును కొందరు సహించలేకపోయారు. నేను గెలుపొందాను .. నా విజయాన్ని ఎంజాయ్​ చేస్తున్నా. ఎవరిమీదా ఎదురుదాడి చేయను. కరోనా మహమ్మారి కారణంగా కుదేలైన ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడం… కరోనాతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడం నా ముందున్న కర్తవ్యం. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తా’ అని జో బైడెన్​ అన్నారు. త్వరలో ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయబోతున్నారు.

First Published:  15 Dec 2020 9:39 AM GMT
Next Story