Telugu Global
Cinema & Entertainment

హైదరాబాద్ లో సూపర్ స్టార్

ఓవైపు పొలిటికల్ పార్టీ స్థాపిస్తానంటూ ప్రకటించిన రజనీకాంత్, మరోవైపు సినిమాలతో కూడా బిజీ అయ్యారు. ఇవాళ్టి నుంచి ఆయన తన కొత్త సినిమాను స్టార్ట్ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన అన్నాత్తై సినిమా ఈరోజు ప్రారంభమైంది. అది కూడా హైదరాబాద్ లో. అన్నాత్తై సినిమాలో రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా.. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇవాళ్టి షూటింగ్ లో ఆమె కూడా జాయిన్ అయింది. ఈరోజంతా నయనతార, రజనీకాంత్ ఫొటోలు ట్రెండ్ అయ్యాయి. లెక్కప్రకారం అన్నాత్తై […]

హైదరాబాద్ లో సూపర్ స్టార్
X

ఓవైపు పొలిటికల్ పార్టీ స్థాపిస్తానంటూ ప్రకటించిన రజనీకాంత్, మరోవైపు సినిమాలతో కూడా బిజీ అయ్యారు. ఇవాళ్టి నుంచి ఆయన తన కొత్త సినిమాను స్టార్ట్ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన అన్నాత్తై సినిమా ఈరోజు ప్రారంభమైంది. అది కూడా హైదరాబాద్ లో.

అన్నాత్తై సినిమాలో రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా.. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇవాళ్టి షూటింగ్ లో ఆమె కూడా జాయిన్ అయింది. ఈరోజంతా నయనతార, రజనీకాంత్ ఫొటోలు ట్రెండ్ అయ్యాయి.

లెక్కప్రకారం అన్నాత్తై సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వల్ల షూటింగ్ ఆగిపోయింది. దీంతో సంక్రాంతికి రావాల్సిన సినిమా సమ్మర్ కు పోస్ట్ పోన్ అయింది. ఈ మూవీ తర్వాత రజనీకాంత్ మరో 2 సినిమాలకు కమిట్ అయ్యారు. రాబోయే 6-7 నెలలు.. ఆయన ఓవైపు సినిమాలు చేస్తూనే, ఇంకోవైపు రాజకీయాల్లో బిజీగా ఉండబోతున్నారు. ఆ వెంటనే ఎన్నికల రణరంగంలోకి కూడా దిగుతారు.

First Published:  14 Dec 2020 3:30 PM IST
Next Story