Telugu Global
International

ప్రెసిడెంట్‌ ట్రంప్... వైట్‌హౌజ్‌ ఖాళీ చేయాల్సిందే " సుప్రీం కోర్టు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఏమనిపించిందో ఏమో.. ఎన్నికల ప్రచారంలోనే ‘ఓడినా.. నేనే ప్రెసిడెంట్‌’ అనుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ‘ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయి.. అది నేను పసిగట్టాను’ అని చెప్పుకొచ్చాడు. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జో బైడెన్ కొత్త ప్రెసిడెంట్‌ అని తీర్పు వచ్చింది. కానీ, డొనాల్డ్‌ ట్రంప్ తన ఓటమిని ఒప్పుకోలేదు. ‘నేను ఎన్నికల్లో ఘనవిజయం సాధించాను. నేను చెప్పేది న్యాయంగా వచ్చిన ఓట్ల గురించి, ఫేక్ ఓట్ల గురించి కాదు. కాబట్టి, నేను వైట్‌హౌజ్ విడిచిపెట్టి […]

ప్రెసిడెంట్‌ ట్రంప్... వైట్‌హౌజ్‌ ఖాళీ చేయాల్సిందే  సుప్రీం కోర్టు
X

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఏమనిపించిందో ఏమో.. ఎన్నికల ప్రచారంలోనే ‘ఓడినా.. నేనే ప్రెసిడెంట్‌’ అనుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ‘ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయి.. అది నేను పసిగట్టాను’ అని చెప్పుకొచ్చాడు.

ఎన్నికల ఫలితాలు వచ్చాయి. జో బైడెన్ కొత్త ప్రెసిడెంట్‌ అని తీర్పు వచ్చింది. కానీ, డొనాల్డ్‌ ట్రంప్ తన ఓటమిని ఒప్పుకోలేదు. ‘నేను ఎన్నికల్లో ఘనవిజయం సాధించాను. నేను చెప్పేది న్యాయంగా వచ్చిన ఓట్ల గురించి, ఫేక్ ఓట్ల గురించి కాదు. కాబట్టి, నేను వైట్‌హౌజ్ విడిచిపెట్టి వెళ్లను’ అని ట్వీట్‌ చేశాడు.

అమెరికా చరిత్రలో ‘వైట్‌హౌజ్‌ విడిచిపెట్టి వెళ్లను’ అన్న మొదటి ప్రెసిడెంట్ కూడా ట్రంపే! ఆయన ముందు నుంచి చెప్తున్నట్టుగానే… ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ ఆ దేశ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ‘జార్జియా, విస్కాన్సిన్‌, పెన్సిల్వేనియా’ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు నిలిపేయాలని ట్రంప్‌ పిటిషన్ వేశాడు. ఈ రాష్ట్రాల్లో ట్రంప్‌కి తక్కువ ఓట్లు పడ్డాయి. పిటిషన్ అయితే వేశాడు కానీ, దానికి తగ్గ ఆధారాలు మాత్రం సమర్పించలేకపోయాడు.

‘మిస్టర్ ట్రంప్‌.. మీ ఆరోపణలకు సంబంధించి, మీరు ఎలాంటి ఆధారాలూ సమర్పించలేకపోయారు. ఈ పిటిషన్ చెల్లదు. మీరు ఇంకా వెళ్లొచ్చు’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తీర్పునిచ్చారు.

ఇలాంటి తీర్పు వస్తుందని ట్రంప్‌ ఊహించలేదు. కానీ, అందరూ ఊహించినట్టుగానే ట్రంప్‌కి కోపం వచ్చింది. మళ్లీ ట్విట్టర్ ఓపెన్ చేశాడు. ‘ఇలాంటి తీర్పు ఇవ్వడం న్యాయాన్ని అవమానించడమే. మీరంతా కలిసి ఈ రోజు అమెరికా ప్రజల్ని మోసం చేశారు. దేశాన్ని కష్టాల్లో పడేశారు. మేం ఇప్పుడే పోరాటం మొదలు పెట్టాం’ అంటూ కోపంగా ట్వీట్ చేశాడు. ట్రంప్ మాత్రమే కాదు, ట్రంప్‌ పార్టీ కార్యకర్తలు కూడా ట్రంప్ ఓటమిని ఒప్పుకోవడం లేదు.

సోషల్‌ మీడియాలో ట్రంప్‌ ట్వీట్ల‌లను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. వేలాదిమంది వీధుల్లోకి వచ్చి ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే సోమవారం ఎలక్టోరల్ కాలేజీ సమావేశం కానుంది. ఇందులోని సభ్యులు బైడెన్‌ని ఎన్నుకుంటే.. ఇక, ప్రెసిడెంట్‌ ట్రంప్ వైట్‌హౌజ్‌ని ఖాళీ చేసి, తన సొంతింటికి వెళ్లిపోవాల్సిందే!

First Published:  12 Dec 2020 11:25 PM GMT
Next Story